న్యూఢిల్లీ, జనవరి 28 (way2newstv.in)
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు పోలింగ్ లో ఇబ్బందులు తప్పేట్లు లేవు. అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఇతరుల్లాగా ఆయన రెండు నియోజకవర్గాలను ఎంపిక చేసుకోలేదు. కేవలం ఒక్క నియోజకవర్గం నుంచే పోటీ చేస్తున్నారు. న్యూఢిల్లీ నియోజకవర్గంలో పేద, మధ్య తరగతి ప్రజలతో పాటు, ఉద్యోగులు కూడా ఎక్కువ శాతం ఉండటం అరవింద్ కేజ్రీవాల్ కు కలసి వస్తుందని ఆమ్ ఆద్మీ పార్టీ అంచనా.కానీ నామినేషన్లు ఉపసంహరణ జరిగిన తర్వాత న్యూఢిల్లీ నియోజకవర్గంలో 28 మంది అభ్యర్థులు మాత్రమే బరిలోకి నిలిచారు. వీరిలో అనేక పార్టీలకు చెందిన వారున్నారు. చిన్నా, చితకా పార్టీలు ఇక్కడి నుంచే పోటీ చేశాయి.
కేజ్రీకి పోలింగ్ కష్టాలు
ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీని పోలికలో ఉండే ఆప్ పార్టీ ఇక్కడ పోటీ చేస్తుంది. అన్ జాన్ ఆద్మీ పార్టీ నుంచి శైలేంద్ర సింగ్ పోటీ చేస్తుండటంతో ఈ పార్టీ కేజ్రీవాల్ ను ఇబ్బంది పెడుతుందేమోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.కేజ్రీవాల్ పై పోటీకి దాదాపు 88 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. అయితే వీరిలో 54 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. కొందరు ఉపసంహరించుకోవడంతో మొత్తం మీద 28 మంది అభ్యర్థులు మాత్రమే మిగిలారు. ఇక కేజ్రీవాల్ పై పోటీకి బీజేపీ తరుపున సునీల్ యాదవ్ ను దింపింది. సునీల్ యాదవ్ యువమోర్చా జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. న్యాయవాదిగా కూడా పేరుంది. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్ఎస్‍యూఐ మాజీ అధ్యక్షుడు రోమేష్ సబర్ వాల్ ను అభ్యర్థిగా బరిలోకి దింపింది.దీంతో కేజ్రీవాల్ కు కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల కన్నా చిన్నా చితకా పార్టీల అభ్యర్థుల నుంచే కేజ్రీవాల్ కు ఇబ్బందులున్నాయంటున్నారు. స్వతంత్ర అభ్యర్థులతో పాటు హిందూస్థాని అవామీ మోర్చా, పీపుల్స్ పార్టీ ఆఫ్ ఇండియా, విజయ్ భారత్ పార్టీ, భారతీయ లోక్ తాంత్రిక్ పోటీ, రైట్ టూ రీకాల్ పార్టీ వంటివి బరిలోకి దిగాయి. దీంతో కేజ్రీవాల్ కు పడే కొన్ని వర్గాల ఓట్లు చీలిపోతాయన్న ఆందోళన ఆమ్ ఆద్మీ పార్టీలో నెలకొంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
No comments:
Post a Comment