Breaking News

02/01/2020

తప్పుల తడకలుగా మున్సిపల్ ఓటర్ల జాబితా

హైద్రాబాద్, జనవరి 1, (way2newstv.in)
మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా తాజాగా రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్ల పరిధిలో విడుదల చేసిన డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్స్లో ఇలాంటి వింతలెన్నో ఉన్నాయి. ఇంటి పేర్లు, అసలు పేర్లలో తప్పుల సంగతి పక్కనపెడితే అనేకచోట్ల.. చనిపోయిన వారి పేర్లు కూడా లిస్టుల్లో కనిపించాయి. ప్రతిపక్షాలు మొత్తుకుంటున్నా, కోర్టులు మొట్టికాయలు వేస్తున్నా ఆఫీసర్లు మాత్రం తమ ఆనవాయితీ కొనసాగించారు. జాబితాల్లో మగవాళ్లను ఆడవాళ్లుగా, ఆడవాళ్లను మగవాళ్లుగా మార్చేశారు. కొన్నిచోట్ల ఏకంగా ఫ్యామిలీలే చెల్లాచెదురయ్యాయి. ఒకే కుటుంబానికి చెందినవారి పేర్లు వేర్వేరు వార్డుల్లో దర్శనమిచ్చాయి. కులాల సంగతి చెప్పనక్కర్లేదు. అనేక చోట్ల ఎస్సీలు, బీసీలుగా, బీసీలు, ఎస్సీలుగా మారిపోయారు.నాగర్కర్నూల్లోని 14వ వార్డు లోని ఓ ఇంట్లో ఏకంగా 30  ఓటర్లు ఉన్నట్లు చూపారు. 
తప్పుల తడకలుగా మున్సిపల్ ఓటర్ల జాబితా

అధికారపార్టీ కోసమే ఇలా చేశారని ఆరోపిస్తున్న విపక్ష నేతలు ఆఫీసర్లకు ఫిర్యాదు చేస్తున్నారు.మరో మూడు రోజుల్లో రిజర్వేషన్లు ప్రకటించనున్న తరుణంలో ఓటర్లిస్టుల్లో ఇంత భారీ సంఖ్యలో తప్పులు దొర్లడం ఇటు ఓటర్లను, అటు ఆశావహులను కలవరపెడుతోంది. ఆదిలాబాద్‍ మున్సిపాలిటీలోని 20వ వార్డు భాగ్యనగర్‍ కాలనీలో 150 మంది ఓటర్ల కులాలను తారుమారు చేశారు. ఎస్సీలను ఎస్టీలుగా, బీసీలను ఎస్సీలుగా పేర్కొన్నారు. 30వ వార్డు ఖానాపూర్‍లోని 200మంది ఓటర్లను ఇతర వార్డులో చేర్చారు. 17వ వార్డు కుర్షీద్‍నగర్‍ ఓటర్లను సుందరయ్యనగర్‍, నిలానగర్‍లో చూపారు.  2వ వార్డు చిల్కూరి లక్ష్మీనగర్‍ కాలనీలోని ఓటర్లను 24వ వార్డు తాటిగూడలోకి మార్చారు. దీంతో తొలిరోజు భారీగా ఫిర్యాదులు వెల్లువెత్తాయి.ఉమ్మడి మెదక్ జిల్లా గజ్వేల్ మున్సిపాలిటీలోని నాలుగో వార్డు లిస్టులో ఏడాది క్రితం మరణించిన ఊడేం పోచమ్మ-, చిగుళ్ల జయరాములు 6 నెలల కింద చనిపోయిన కదుళ్ల యాదగిరి, మార్కంటి నర్సింలు , నాగులు, రామయ్య, నర్సి చంద్రయ్య పేర్లు కనిపించాయి. మెదక్ పట్టణంలోనూ 8వ వార్డులో సిద్దిగారి లక్ష్మి, ఎండీ యూసుఫ్ఖాన్, బర్పూర్సింగ్ అనే వ్యక్తులు చనిపోయినా ఓటరు జాబితాలో మాత్రం నిక్షేపంలా ఉన్నారు. 34 మంది పేర్లు రెండుచోట్ల ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ రెండో వార్డులో తొమ్మిది మంది మరణించిన వారి పేర్లు  కనిపించాయి.ఉమ్మడి నిజామాబాద్జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో తప్పులు దొర్లాయి. కామారెడ్డి మున్సిపాల్టీలోని 31వ వార్డులో ఇంటి నంబరు 4–10–109లో ఓటరు పేరు ‘ద’ అని, అతని తండ్రి పేరు ‘జ’ అని వచ్చింది. ఇదే ఇంటిలోని మరో ఇద్దరు భార్యాభర్తల పేర్లు ‘ప’ అనే వచ్చాయి.  బోధన్ పట్టణంలోని 3–7–137 ఇంట్లోని మహిళా ఓటరు పేరు స్థానంలో ‘క కక క’ అని వచ్చింది. అనేక చోట్ల చనిపోయిన వ్యక్తులు లిస్టుల్లో కనిపించారు.ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని అనేక మున్సిపాలిటీల్లో చనిపోయిన వారి ఓట్లను తొలగించలేదు. అధికార పార్టీ నాయకుల ఇళ్ల నంబర్లపైనా,  బంధువుల ఇళ్ల నంబర్లపైనా కొత్త ఓట్లు పుట్టుకొచ్చాయి.  నారాయణపేట మున్సిపాలిటీలో భారీగా తప్పులు బయట పడుతున్నాయి. ఏకంగా ఓ  మాజీ ప్రజాప్రతినిధి తన బంధువుల ఇళ్లలో ఏకంగా 30 ఓటర్లను నమోదు చేయించుకుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాగర్కర్నూల్మున్సిపాలిటీలోని ఉయ్యాలవాడ గ్రామంలో 91మంది ఎస్సీలను బీసీలుగా నమోదు నమోదు చేశారని  కాంగ్రెస్, బీజేపీ నేతలు  జేసీ శ్రీనివాస్రెడ్డికి ఫిర్యాదు చేశారు. పట్టణంలో 14వ వార్డు లోని హౌస్ నెంబర్ 18/283  ఇంట్లో  30  ఓటర్లు ఉన్నట్లు నమోదు చేశారని ఆరోపించారు.  నాగర్ కర్నూల్ పట్టణంలోని పలు వార్డుల్లో మైనార్టీలందరినీ బీసీలుగా గుర్తించారని ఆరోపించారు. దీనిపై  సమగ్రవిచారణకు జేసీ మున్సిపల్ కమిషనర్కు  ఆదేశించారు.జనగామ మున్సిపాలిటీలో పలువురు ఎస్సీ ఓటర్లను బీసీలుగా, బీసీ ఓటర్లను ఎస్సీలుగా మార్చేశారు. చనిపోయిన వారి పేర్లూ లిస్టుల్లో కనిపించాయి. ఇంటి పేరు ఆధారంగా ఏదో ఒక అంచనాకు రావడం వల్లే ఇలాంటి తప్పిదాలు జరిగాయి. మూడో వార్డుకు చెందిన జాబితాలో ఏకంగా 9 మంది చనిపోయినవాళ్లున్నారు. ఓ ఓటర్ పేరును ఏదో భాషలో తెలిపారు.ఉమ్మడి నల్గొండ జిల్లాలో వందలాది ఓట్లు గల్లంతుకాగా,అనేకమంది కులాలు మారిపోయాయి. కోదాడ మున్సిపాలిటీలో  ఏడాది క్రితం చనిపోయిన వారిని కూడా జాబితాల్లో చేర్చారు. సూర్యాపేట మున్సిపాలిటీలో అధికార పార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్‌ నిమ్మల వెంకన్నతో పాటు, మరో కౌన్సిలర్‌ పేర్లు గల్లంతయ్యాయి. కోదాడ పట్టణంలోని పది వార్డుల్లో ఓటర్లు తారుమారయ్యారు.  యాదాద్రి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీలోని 8వ వార్డుకు చెందిన ఏలె వెంకటేశ్వర్లు, పోచం సుజాత ఏడాది క్రితం, పోచం లింగయ్య నాలుగు నెలల క్రితమే చనిపోయారు. అయినా వారి పేర్లు లిస్టుల్లో కనిపించాయి. సుజాత పేరున రెండు ఓట్లు నమోదయ్యాయి. పన్నాల శ్రీనివాస్‌రెడ్డి ఓటు 8వ వార్డులో ఉండగా, అతడి భార్య ఓటు ఒకటో వార్డులో కనిపించింది. యాదగిరిగుట్ట మున్సిపాలిటీలోని 11వ వార్డులో 30 మంది ఓసీ ఓటర్లను బీసీలుగా ప్రకటించారు. కొన్ని వార్డుల్లో అయితే కొడుకు పేరు ప్లేస్‌లో తండ్రి పేరు, తండ్రి పేరు ప్లేస్‌లో కొడుకు పేరు నమోదైంది.మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లి మున్సిపాలిటీలో ని 13 వార్డు పరిధిలోని 131 మంది ఓటర్లను 14వ వార్డు పరిధిలోకి తెచ్చారు. ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లను వేర్వేరు వార్డుల్లో నమోదు చేశారు. కడాలి నాగేశ్వర్రావు కుటుంబానికి చెందిన నాగేశ్వర్రావు, అతని సతీమణి నాగలక్ష్మి పేర్లు 13వ వార్డులో ఉండగా వారి సంతానమైన సత్యబాలాజీ, సుష్మా పేర్లు 14వ వార్డు పరిధిలో కనిపించాయి. ఏ లిస్టు పట్టుకున్నా ఇలాంటి తప్పులే కనిపిస్తున్నాయి.ఖమ్మంజిల్లాలోనూ ఇదే పరిస్థితి. చాలాచోట్ల ఓటర్ల కులాలను మార్చేశారు. సత్తుపల్లిలోని15వ వార్డులో బొంతు శైలజ అనే మహిళ కులం కమ్మ. కానీ లిస్టులో బీసీగా చూపారు. అదే ఇంట్లో వారి బాబు బొంతు శ్రీహరిబాబును 15వ వార్డు నుంచి 3వ వార్డులోకి జంప్ చేశారు.కరీంనగర్ కార్పొరేషన్ లోని 25వ డివిజన్‌లో 4,491 ఓట్లు ఉన్నాయి. పునర్విభజన నాటి నుంచి ఈ డివిజన్ వివాదాస్పదంగా మారింది. ఇందులో సుమారు 200కు పైగా ఎస్సీ  ఓటర్లను బీసీలుగా చూపించారు. దీంతో ఈ డివిజన్ రిజర్వేషన్ పై తీవ్ర ప్రభావం పడనుంది. కేవలం ఓ నాయకుడి కోసమే ఇదంతా చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దీనిని నిరసిస్తూ దళిత సంఘాలు కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టాయి.ఇతని పేరు కానుగంటి శ్రీనివాస్‌‌. గోదావరిఖని ఎల్‌‌బీనగర్‌‌లో ఉండే ఈయన గవర్నమెంట్‌ టీచర్‌. ఓటర్‌‌ స్లిప్పులో ఈయన పేరు పక్కన ఫిమేల్‌‌ అని ఉంది. ఉషాఠాకూర్‌, ‌ నీలం ఉషారాణి అనే మహిళలను మేల్‌గా ఉంది.

No comments:

Post a Comment