Breaking News

01/01/2020

నూతన సంవత్సరం నేపథ్యంలో యాదాద్రిలో భక్తుల రద్దీ

యాదాద్రి భువనగిరి జనవరి 1 (way2newstv.in)
నూతన సంవత్సరం నేపథ్యంలో యాదాద్రిలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీలక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. స్వామి వారి ధర్మ దర్శనానికి 2 గంటల సమయంలో, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతోంది. ఆలయ అధికారులు భక్తులకు లఘు దర్శనం కల్పిస్తున్నారు. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా 2020 ఆంగ్ల సంవత్సరాది తొలిరోజు వేడుకలను బుధవారం నిర్వహించేందుకు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేశారు.
నూతన సంవత్సరం నేపథ్యంలో యాదాద్రిలో భక్తుల రద్దీ

భక్తుల రద్దీ దృష్ట్యా కొండపైకి వాహనాలను అనుమతించడం లేదు పోలీసులు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రసాద విక్రయ కేంద్రాలను ఉద యం 5 గం టల నుంచి రాత్రి 10 గంటల వరకు తెరవనున్నా రు. 60వేల, 100 గ్రాముల లడ్డూలు, అభిషేకం లడ్డూలు 15, 000, సరిపడ పులిహోర ప్రసాదం, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక దర్శనం, ధర్మదర్శనం క్యూలైన్లలో తాగునీటి సౌకర్యం కల్పించారు. అవసరమైన చోట శామియానాలు ఏర్పాటు చేశారు.

No comments:

Post a Comment