జిల్లా జాయింట్ కలెక్టర్ ఏ.భాస్కర్ రావు
నిర్మల్ జనవరి 25 (way2newstv.in)
శనివారం రోజున నిర్వహించనున్న మున్సిపల్ ఓట్ల లెక్కింపు కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ఏ. భాస్కరరావు అన్నారు. శుక్రవారం నిర్మల్ పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్మల్, బైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీ లకు సంబంధించిన కౌంటింగ్ కేంద్రాలను అయన పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం అయన మాట్లాడుతూ శనివారం ఉదయం 8గంటల నుండి నిర్వహించనున్న నిర్మల్, బైంసా, ఖానాపూర్ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ను పారదర్శకంగా నిర్వహించేందుకు అన్నీ ఏర్పాటు పూర్తి చేయడం జరిగిందని అన్నారు.
ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధం
ఓట్ల లెక్కింపు కోసం నియమించబడిన సిబ్బంది,ఇతర సిబ్బంది శనివారం ఉదయం 6.30 గంటల లోపు కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవాలని ఆయన తెలిపారు . ఓట్ల లెక్కింపునకు అవసరమయ్యే టేబుల్స్, మిక్సింగ్ డ్రమ్ములు, కంప్యూటర్లు తదితర వస్తువులు సిద్ధం చేయడం జరిగిందని తెలిపారు. అధికారులకు, సిబ్బందికి, మీడియా పాత్రికేయులకు త్రాగునీరు ,అల్పాహారం కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కౌంటింగ్ పాస్ లు ఉన్న వారినే లోనికిఅనుమతించాలని, ఎలాంటి సంగఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని పొలీసు అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, డిఈ సంతోష్ కుమార్, ఎం.పి.డి ఓలు మోహన్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment