Breaking News

29/01/2020

సిటీలో రెట్టింపు కానున్న దవాఖానాలు

హైద్రాబాద్, జనవరి 29, (way2newstv.in)
గ్రేటర్‌ హైదరాబాద్‌లో ప్రతి ఒక్కరికీ వైద్య సేవలు అందుబాటులో ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం నగరంలో నిర్వహిస్తున్న బస్తీ దవాఖానాల సేవల పట్ల ప్రభుత్వం సంతృప్తి చెందు తుండగా, వైద్య సేవలు తమ ఇండ్ల ముందుకు వచ్చేసరికి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో బస్తీ దవాఖానాలను మరిన్ని పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గ్రేటర్‌ వ్యాప్తంగా ప్రస్తుతం 104 బస్తీ దవాఖానాలు నడుస్తుండగా, కొత్తగా మరో 256 బస్తీ దవాఖాల ప్రతిపాధనలను ప్రభుత్వానికి పంపింది. కొత్త బస్తీ దవాఖానాలను ప్రభుత్వం మంజూరు చేస్తే గ్రేటర్‌ హైదరాబాద్‌లో మొత్తం 360 బస్తీ దవాఖానాలు కానున్నాయి.
సిటీలో రెట్టింపు కానున్న దవాఖానాలు

హైదరాబాద్‌లో ప్రధాన ఆసపత్రులు గాంధీ, ఉస్మానియా, ఛాతీ, ఫివర్‌, ఈఎన్‌టీ తదితర ప్రభుత్వ ఆసుపతులు కొనసాగుతున్నాయి. వీటితో పాటు నగరంలో అర్భన్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్లు నిర్వహణ అవుతున్నాయి. ప్రయివేటు ఆసుపత్రుల్లో వైద్యం ఖరీదు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రులపై రోగుల తాకిడి విపరీతంగా పెరుగుతోంది. నగరంలో కోటికి పైగా జనాభా ఉన్నప్పటికీ, నగరానికి వచ్చే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. ఈ నేప థ్యంలో హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌, సంగారెడ్డి జిల్లాల పరిధిలో గ్రేటర్‌ వ్యాప్తంగా ప్రభు త్వం 104 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేసింది. ఈ దవాఖా నాలలో ఉచిత వైద్య సేవలు, 135 రకాల మందులతో పాటు దాదాపు 200 వైద్య పరీక్షలు రోగు లకు అందుబాటులో ఉంటున్నాయి. న్యూఢిల్లీలోని మహల్లా క్లీనిక్‌ల స్పూర్తితో ఏర్పాటుచేసిన ఈ బస్తీ దవాఖానాల పట్ల ప్రభుత్వం సంతృప్తి వ్యక్తం చేయ డంతో ఈ కేంద్రాలను పెంచేందుకు నిర్ణయం తీసుకుంది.జీహెచ్‌ఎంసీ పరిధిలో దాదాపు 1400లకు పైగా బస్తీలున్నాయి. బస్తీ దవాఖానాలు 104 మాత్రమే ఉన్నాయి. నగర ప్రజలకు ప్రతినెలా వైద్యం నిమిత్తం దాదాపు రూ5 వేల నుంచి రూ.10 వేలు అవుతున్నట్టు అవుతున్నాయి. ఈ క్రమంలో బస్తీ ప్రజలకు వైద్యం ఆర్థిక భారం కాకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుతం వచ్చే 50-60 రోగుల సంఖ్యను 100కు పెరిగేలా ప్రజలను చైతన్యం చేయాలని అధికారులను ఆదేశించింది. ఈ క్రమంలో యూసీడీ విభాగం ఆధ్వర్యంలో 1090 స్లమ్‌ లెవల్‌ ఫెడరేషన్ల ద్వారా బస్తీ దవాఖానాల్లో వైద్య సేవలను వినియోగించుకునేలా బస్తీ ప్రజల్లో మరింత చైతన్యానికి గతంలో ప్రణాళికలు రచించారు. అంతే కాకుండా, కొత్తగా 97 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలని భావించారు. కానీ, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరిన్ని ప్రతిపాధనలు చేయాలని ఆదేశాలు రావడంతో గ్రేటర్‌లో కొత్తగా 256 బస్తీ దవాఖానాలు నెలకొల్పాలని నివేదిక అందజేశారు. అయితే, ఈ ప్రతిపాధనకు ప్రభుత్వం ఆమోదించడంతో ప్రస్తుతం పనిచేస్తున్న 104 బస్తీ దవాఖానాలతో పాటు మొత్తం 360 బస్తీ దవాఖానాలు కానున్నాయి.

No comments:

Post a Comment