విజయవాడ, జనవరి 20, (way2newstv.in)
లోక్‌సభ, రాజ్యసభలు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలుకు సిద్ధమౌతున్నాయి. బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ఏప్రిల్ 3 వరకు బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి,జనవరి 31న ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించనున్నారు. ఫిబ్రవరి ఒకటో తేదీన ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు మొదటి విడత బడ్జెట్ సెషన్, మార్చి 2 నుంచి ఏప్రిల్ 3 వరకు రెండవ విడత బడ్జెట్ సెషన్ జరగనున్నాయి. ఫిబ్రవరి 12 నుంచి మార్చి 1 వరకు మధ్యలో విరామం ఉంటుంది. రెండు విడతల మధ్య ఉండే బ్రేక్ లో శాఖల వారీగా ఉన్న బడ్జెట్ కేటాయింపులను పార్లమెంటరీ కమిటీలు పరిశీలించనున్నాయి.ఫ్రస్తుతం ఆర్థిక వ్యవస్థ మందగమనం, దానిని అధిగమించడానికి అవసరమైన చర్యలపై ప్రభుత్వం కసరత్తు తీవ్రం చేసింది.
ప్రస్తుతం దేశీయ ఆర్థిక వ్యవస్థలో మందగమనం, జీడీపీ తగ్గుతుందనే అంచనాల మధ్య రాబోయే బడ్జెట్ మోడీ సర్కార్ కు పెను సవాలే.సాధారణ బడ్జెట్ 2020 ఫిబ్రవరి 1న ప్రవేశపెడితే, ఆర్థిక సర్వే జనవరి 31వ తేదీన వస్తుంది. బడ్జెట్‌ను సమర్పించడానికి అన్ని సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ పలు రాయితీలను ప్రకటించే అవకాశం ఉంది.బడ్జెట్ ముద్రణ పూర్తిగా రహస్యంగా నిర్వహిస్తారు. బడ్జెట్ ముద్రణ ప్రక్రియతో సంబంధం ఉన్న అధికారులు, ఉద్యోగులు మొత్తం ప్రపంచం నుండి 10 రోజులు దూరంగా ఉంటారు. ఈ 100 మంది అధికారులు, ఉద్యోగులను ఇంటికి వెళ్ళడానికి కూడా అనుమతించరు.ఆర్థిక మంత్రి, చాలా సీనియర్ అధికారులకు మాత్రమే ఇంటికి వెళ్ళటానికి అనుమతి ఉంటుంది. ఈకాలంలో ఆర్థిక మంత్రిత్వశాఖ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తుంది. బయటి వ్యక్తి ఎవరూ ఆర్థిక మంత్రిత్వ శాఖలోకి ప్రవేశించరు.బడ్జెట్ ముద్రణ సమయంలో ప్రింటింగ్ అధికారులు, ఉద్యోగులు బయటకు రావడం లేదా వారి సహచరులను కలవడం కూడా నిషేధిస్తారు. తప్పని సరైతే.. భద్రతా సిబ్బంది పర్యవేక్షణలో లోపలికి పంపుతారు.వైద్యుల బృందాన్ని కూడా 10 రోజుల పాటు ఆర్థిక మంత్రిత్వ శాఖలో నియమిస్తారు. ఒక ఉద్యోగి అనారోగ్యానికి గురైతే అతనికి వైద్య సదుపాయాలు కల్పిస్తారు.ఇంటర్నెట్, ఎన్‌ఐసీ సర్వర్లు బడ్జెట్ పత్రం ఉన్న కంప్యూటర్ల నుండి తొలగిస్తారు. ఎలాంటి హ్యాకింగ్ లేకుండా ఏర్పాట్లు చేస్తారు. ఈ కంప్యూటర్లు ప్రింటర్, ప్రింటింగ్ మాత్రమే ప్రింటింగ్ మెషిన్‌కు మాత్రమే అనుసంధానిస్తారు. ప్రింటింగ్ ప్రెస్ ఉన్న ఆర్థిక మంత్రిత్వశాఖలో ఎంపిక చేసిన సీనియర్ అధికారులను మాత్రమే సందర్శించడానికి అనుమతిస్తారు. 2020 బడ్జెట్‌పై ప్రజలకు అధిక అంచనాలు ఉన్నాయి. ఈసారి మోదీ ప్రభుత్వం ప్రజలకు మరింత ఉపశమనం కలిగించేందుకు యత్నిస్తోందని భావిస్తున్నారు. దేశీయ ఆర్థిక వ్యవస్థ చాలా కాలంగా మాంద్యానికి వ్యతిరేకంగా పోరాడుతోంది. ఈ తరుణంలో బడ్జెట్ వస్తోంది. మోదీ ప్రభుత్వం 2024 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను లక్ష్యంగా పెట్టుకుంది. ఆర్థిక వ్యవస్థ వేగవంతానికి తీసుకుంటున్న చర్యలపై ప్రభుత్వం సవాళ్లను ఎదుర్కొంటోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లోటు స్థూలజాతీయోత్పత్తిలో 3.8 శాతానికి పెరగవచ్చు..సెప్టెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికంలో భారత జిడిపి వృద్ధి ఆరేళ్ల కనిష్టం 4.5 శాతానికి చేరుకుంది. ఆర్థికవేత్తలు, ఆర్థిక సంస్థలు దీనికి కారణం డిమాండ్, వినియోగం తగ్గడమేనని చెబుతున్నారు..మోదీ సర్కార్ కార్పొరేట్ పన్నులో భారీ కోతలను ఇటీవల ప్రకటించింది.అలాగే ఆర్థిక వ్యవస్థకు ఊపునిచ్చేలా 102 లక్షల కోట్ల రూపాయల మౌలిక సదుపాయాల ప్రాజెక్టును ప్రకటించారు.కొత్త సంప్రదాయానికి తెరకేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్రిటీష్ కాలంనాటి సంప్రదాయానికి తెరదించారు. బడ్జెట్ స్పీచ్‌ను ఆర్థిక మంత్రి లెదర్ బ్రీఫ్‌కేస్‌లో తీసుకురావడం తరతరాలుగా వస్తున్న సంప్రదాయం. ఆ ఆనవాయితీకి నిర్మలా సీతారామన్ చెక్ పెట్టేశారు. 2019 లో నిర్మల తొలి బడ్జెట్ స్పీచ్‌ను ఎరుపు రంగు వస్త్రంలో తీసుకొచ్చారు. దానిపై జాతీయ చిహ్నం కూడా ఉంది.బడ్జెట్ ప్రతుల్ని లెదర్ సూట్‌కేస్‌లో తీసుకొచ్చే సంప్రదాయం ఇప్పటిది కాదు. 1860వ సంవత్సరంలో మొదలైంది. విలియం ఇ.గ్లాడ్‌స్టోన్ ప్రారంభించిన సంప్రదాయమిది. అప్పట్నుంచీ 'గ్లాడ్‌స్టోన్ బాక్స్' అని పిలిచేవారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా అదే సంప్రదాయం కొనసాగుతోంది. ఇప్పటివరకు పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రులందరూ లెదర్ బ్రీఫ్‌కేస్‌లోనే బడ్జెట్ ప్రతుల్ని తీసుకొచ్చారు. ఎన్‌డీఏ ప్రభుత్వం ఆ సంప్రదాయానికి ఫుల్‌స్టాప్ పెట్టింది. రెడ్ కలర్ బ్యాగ్‌లో బడ్జెట్ పత్రాలను తీసుకురావడంతో పాటు బడ్జెట్ పేరును 'దేశ్ కా బహీ ఖాతా' అని పేరు మార్చింది.
No comments:
Post a Comment