హైద్రాబాద్, డిసెంబర్ 9, (way2newstv.in)
హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంలో మెట్రో రైలు నిర్మాణాన్ని ప్రభుత్వం రద్దు చేసినట్టు తెలిసింది. పాతబస్తీ మార్గంలో మెట్రో రైలు వద్దని ఎంఐఎం అభ్యంతరం తెలిపిందని, ఆ ఒత్తిడికి తలొగ్గే సర్కారు వెనక్కి తగ్గిందని అధికారవర్గాలు చెప్తున్నాయి. అందుకే ఎయిర్పోర్టుకు మెట్రో రైలు నిర్మించడంపై సర్కారు ప్రత్యామ్నాయ మార్గాన్ని ప్రతిపాదించినట్టు తెలిసింది. అయితే ఇలా రూట్మార్చడం సరికాదని, లాభదాయం కూడా కాదని నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ స్పష్టం చేసినట్టు సమాచారం. దీంతో ఎయిర్పోర్టు వరకు మెట్రోరైలును నిర్మించడం ఎట్లాగనే దానిపై కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది.హైదరాబాద్ లో ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు 73 కిలోమీటర్ల పొడవుతో మూడు మార్గాల్లో మెట్రో రైలు నిర్మాణం చేపట్టారు.
ఓల్డ్ సిటీకి మెట్రో లేనట్టే
నాగోల్ – హైటెక్ సిటీ (29 కిమీ), ఎల్బీనగర్– మియాపూర్ (29 కిమీ) మార్గాలు పూర్తయి అందుబాటులోకి వచ్చాయి. హైటెక్ సిటీ నుంచి రాయదుర్గం వరకు అదనంగా ఒక కిలోమీటర్ రూట్‌ను ఇటీవలే పూర్తి చేసి ప్రారంభించారు. అయితే జూబ్లీ బస్టాండు – ఫలక్ నుమా (15 కిలోమీటర్లు) రూట్కు తొలి నుంచీ అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఇందులో జూబ్లీ బస్టాండు నుంచి ఎంజీబీఎస్ వరకు నిర్మాణ పనులు పూర్తయ్యాయి. అక్కడి నుంచి ఫలక్ నుమా వరకు మెట్రో నిర్మించాలంటే పాతబస్తీలోని సాలర్ జంగ్ మ్యూజియం, చార్మినార్, శాలిబండ, శంషీర్ గంజ్ ప్రాంతాల మీదుగా వేయాలి. ఇందుకోసం పాతబస్తీలో కొన్ని బిల్డింగులు, దుకాణాలు తొలగించాల్సి ఉంటుంది. ఆస్తులు ఇచ్చేందుకు స్థానికులు అభ్యంతరం చెప్తుండగా.. ఎంఐఎం సపోర్టుగా నిలబడింది. దీంతో ఎంజీబీఎస్ నుంచి ఫలక్ నుమా మధ్య 6.3 కిలోమీటర్ల మేర సర్వే కూడా చేయలేకపోయారు. జూబ్లీ బస్టాండ్– ఎంజీబీఎస్ మధ్య ట్రయల్ రన్ జరుగుతోంది. జనవరి చివర్లోనో, ఫిబ్రవరి తొలివారంలోనో ప్రారంభించే చాన్స్ ఉంది.శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు మెట్రో నిర్మించాలంటే ఫలక్ నుమా నుంచి దూరం తక్కువగా ఉంటుంది. కానీ ఎంఐఎం అభ్యంతరంతో ఆ రూట్ను సర్కారు పక్కనపెట్టినట్టు ఓ ఉన్నతాధికారి చెప్పారు. బదులుగా ఎంజీబీఎస్ నుంచి సిటీ కాలేజీ, జూపార్క్ ప్రాంతాల మీదుగా ఎయిర్ పోర్టు వరకు మెట్రో నిర్మించాలంటూ సర్కారు కొత్త ప్రతిపాదన చేసినట్టు తెలిసింది. దానిపై స్టడీ చేసిన ఎల్ అండ్ టీ కంపెనీ.. ఆ రూట్లో మెట్రో నిర్మిస్తే ఖర్చు బాగా పెరుగుతుందని, లాభదాయకం కాదని స్పష్టం చేస్తూ సర్కారుకు లేఖ రాసినట్టు ఓ అధికారి తెలిపారు.భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఎయిర్ పోర్టు వరకు మెట్రో నిర్మాణాన్ని పొడిగించాలని ప్రభుత్వం భావించింది. ఫలక్ నుమా వరకు మెట్రో కారిడార్ నిర్మించే ప్రతిపాదన ఉన్నందున.. అక్కడి నుంచి శంషాబాద్ వరకు నిర్మించాలని నిర్ణయించింది. కానీ ఇప్పుడు ఫలక్నుమా రూట్ను పక్కనపెట్టడంతో ఎయిర్పోర్టుకు కనెక్టివిటీ ఎట్లాగనే ప్రశ్న తెరపైకి వచ్చింది. జూపార్క్ రూట్లో చేపడదామన్న ప్రతిపాదనకు నిర్మాణ సంస్థ ఇప్పటికే నో చెప్పడంతో సర్కారు ప్రత్యామ్నాయ రూట్లపై కసరత్తు చేస్తోంది. రాయదుర్గం వరకు ఉన్న మార్గాన్ని శంషాబాద్ వరకు పొడిగిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. రాయదుర్గం నుంచి ఎయిర్ పోర్టు వరకు సుమారు 32 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ రూట్లో మెట్రో నిర్మించేందుకు ఎంత ఖర్చవుతుంది, ఎంత భూసేకరణ అవసరం, ప్రజలకు ఏ మేరకు ఉపయోగపడుతోందనే అంశాలను పరిశీలిస్తున్నట్టు తెలిసిం
No comments:
Post a Comment