Breaking News

09/12/2019

ప్రతిపక్షాన్ని మించిపోతున్న జనసేనాని

విజయవాడ, డిసెంబర్ 9 (way2newstv.in)
చంద్రబాబు రాజకీయ జీవితం నాలుగు దశాబ్దాల పై మాట. ఆయన ముమ్మారు ముఖ్యమంత్రిగా పనిచేశారు. పైగా ప్రతిపక్ష నాయకుడిగా కూడా మూడవసారి పాత్ర పోషిస్తున్నారు. ఏ విషయాన్ని అయినా రాజకీయం చేయడంలో చంద్రబాబుకు మించిన వారు లేరని అంటారు. అన్నీ తన ఘనతగా చెప్పుకోవడమూ చంద్రబాబుకే చెల్లు. అటువంటి చంద్రబాబు ఇపుడు ప్రతిపక్ష నాయకుడిగా దూకుడు మీద ఉన్నారా అంటే లేదనే చెప్పాలంటున్నారు. చంద్రబాబు అవుట్ డేటెడ్ పాలిటిక్స్ చేస్తారని పేరు.. ఆయన ఇప్పటి కాలానికి తగినట్లుగా మారలేకపోవడమే కాదు,ఇంకా పాత పద్ధతులే తనకు విజయాన్ని చేకూరుస్త్తాయని చంద్రబాబు నమ్మకంతో ఉండడమే అసలైన చిత్రం ఇక ఏపీలో జగన్ నాయకత్వంలో యువ ప్రభుత్వం ఉంది. మరో వైపు జనసేన నాయకుడు పవన్ కూడా యువకుడే. 
ప్రతిపక్షాన్ని మించిపోతున్న జనసేనాని

ఈ ఇద్దరి జోరు మధ్య చంద్రబాబు దాదాపుగా చిన్నబోతున్నారనే అంటున్నారు. పవన్ కళ్యాణ్ ది సినిమా చరిష్మా. జగన్ ది ప్రజాకర్షణ. ఈ విధంగా చూసుకున్నా చంద్రబాబు తగ్గిపోవాల్సివస్తోంది. పైగా పవన్ ప్రతిపక్ష పాత్రలో బాగానే కుదురుకుంటూంటే జగన్ అధికారంలో పది కాలాలు ఉండేలా దూకుడు రాజకీయం చేస్తున్నారు. మధ్యలో చంద్రబాబు మాత్రం వెనకబడిపోతున్నారని అంటున్నారు.ఇక పవన్ విషయానికి వస్తే ఆయన ప్రతిపక్ష నేతగా చంద్రబాబుని వెనకకు నెట్టేస్తున్నారా అన్న అనుమానాలు వస్తున్నాయి. నిజానికి 23 మంది ఎమ్మెల్యేలు ఉన్న చంద్రబాబు ప్రధాన రాజకీయ పక్ష నాయకుడు., కానీ ఒక్క ఎమ్మెల్యే ఉన్న పవన్ దూసుకుపోవడానికి ఆయనకు జనంలో ఉన్న ఆకర్షణ అతి ముఖ్య కారణం. అదే సమయంలో పవన్ కాదేదీ సమస్యకు అతీతం అన్నట్లుగా ఉల్లిని వదలేదు, టమాటాను విడవడంలేదు. చంద్రబాబు ఇసుక, అమరావతి వద్దగే ఆగిపోతే అ ఆలలో ఊ దాకా పవన్ వచ్చేశారిపుడు. నిజానికి పవన్ అన్న తరువాతనే ఉల్లి పాయల విషయంలో చంద్రబాబు కూడా స్పందించాల్సివచ్చింది. మరి విశేష రాజకీయ అనుభవం కలిగిఉన్న చంద్రబాబుకు ఉల్లి కోసం జనం పడుతున్న పాట్లు కనిపించకపోవడం విడ్డూరమే. అదే సమయంలో దేశవ్యాప్త సమస్య అయిన ఉల్లిని కూడ జగన్ మెడకు తగిలించేసి దాని సంగతి తేల్చకపోతే ఊరుకోనని పవన్ గట్టిగానే హెచ్చరించేశారు. మరో వైపు టమాటా రైతుల పక్షాన కూడా పవన్ నిలబడి నేనున్నాను అంటున్న రోజున చంద్రబాబు అమరావతి రౌండ్ టేబిల్ మీటింగులో ఉన్నారు.హిందూ మతం కార్డుని పవన్ బాగానే వాడేస్తున్నాడు. మత మార్పిళ్ళు చేస్తే సహించేది లేదని తర్జనితో బెదిరిస్తున్నాడు. చంద్రబాబు ఈ విషయంలోనూ పెద్దగా స్పందించడంలేదన్న కామెంట్స్ సొంత పార్టీ నుంచే ఉన్నాయి. పవన్ ప్రసంగాలలో భాష సంగతి పక్కన పెడితే ఆవేశం పాలు ఎక్కువ. అది యువతను కట్టిపడేస్తోంది. అదే చంద్రబాబు ఆచీ తూచీ మాట్లాడినా క్యాడర్ కి బోర్ గానే ఉంటోంది.. వీటిని మించి మద్దతు రాజకీయాలు, పొత్తుల విషయంలో కూడా పవన్ బాబును మించి ముందుకు వెళ్ళిపోతున్నారు. నేను బీజేపీని ఎపుడు వ్యతిరేకించానూ అంటూ పవన్ మీడియా ముందు అమాయకంగా ముఖం పెడితే ఏం చెప్పాలో విలేకరులకే అర్ధం కాని పరిస్థితి.అదే చంద్రబాబుని విలేకరులు మీరు బీజేపీతో పొత్తు పెట్టుకోరా అంటే ఏం చెప్పలేకపోయారు. పవన్ ది వ్యక్తిగతం. మేము ఆలోచించి చూడాలి అంటూ చెప్పాల్సివచ్చింది. అంటే బీజేపీతో చెలిమి విషయంలోనూ చంద్రబాబు కంటే వేగంగానే పవన్ పావులు కదిశారన్నమాటేగా. యూ టర్నుల విషయంలో కూడా పవన్ ఆయన్ని దాటేస్తున్నారు. హిందువుల వల్లనే మత కలహాలు అంటూ అన్న నోటితోనే నా మాటలు వక్రీకరించారని చెప్పడమూ పవన్ కే చెల్లిందని అంటున్నారు. మొత్తం మీద చూసుకుటే బలం సంగతేమో కానీ చంద్రబాబు కంటే కూడా పవన్ దూకుడు మాత్రం ఎక్కువేవని ఇప్పటికి వరకూ అంతా అంటున్న మాట. మరి చూడాలి. ముందు ముందు ఆ స్పీడ్ ఎక్కడివరకూ సాగుతుందో.

No comments:

Post a Comment