Breaking News

12/12/2019

అంగన్ వాడీ కేంద్రాల్లో ఎగ్ మిస్

హైద్రాబాద్, డిసెంబర్ 12, (way2newstv.in)
అంగన్‍వాడీ కేంద్రాల్లో పిల్లలు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందడం లేదు. గత నెల రోజులుగా సంబంధిత  కాంట్రాక్టర్‍  అంగన్వాడీలకు కోడి గుడ్లను సరఫరా చేయడం లేదు. దాంతో అడిగిన వారందరికీ   సమాధానం చెప్పలేక పోతున్నామని   అంగన్‍వాడీ టీచర్లు  ఆందోళన చెందుతున్నారు.  గుడ్ల  ధరలు బహిరంగ మార్కెట్‍లో పెరిగినప్పుడల్లా కాంట్రాక్టర్లు గుడ్ల సరఫరా చేయడం లేదని అంగన్‍వాడీ  సుపర్‍వైజర్లు  కూడా నిర్ధారిస్తున్నారు. అంగన్‌‌వాడీల్లో చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు పోషకాహారం అందుతున్న తీరుతెన్నులను పరిశీలించేందుకు రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యులు కొంతం గోవర్దన్‌‌డ్డి, బానోతు సంగులాల్, ఎం. భారతి గత శనివారం నగరంలోని  కొన్ని అంగన్వాడీ  కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. కేంద్రంలోని చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందుతున్న పౌష్టికాహారంపై ఆరా తీశారు.  
అంగన్ వాడీ కేంద్రాల్లో ఎగ్ మిస్

తమకు కోడిగుడ్లను ఇవ్వడం లేదని,  ఇస్తున్న పాలు కూడా నాణ్యంగా ఉండడం లేదని కమిషన్‍ సభ్యుల దృష్టికి తీసుకు రావడం గమనార్హం.జిల్లాలోని 5 ఐసీడీఎస్‌‌ ప్రాజక్టుల పరిధిలో నెల రోజులుగా మెజారిటీ అంగన్‌‌వాడీ కేంద్రాలకు కోడిగుడ్డు, పాలు  సరఫరా అస్తవ్యస్తంగా మారింది.  దాంతో  పౌష్టికాహారాన్ని అందించడంలో అంగన్వాడీలు విఫలం అవుతున్నాయి. గుడ్లను ఎందుకివ్వడం లేదని సరఫరా చేసే సుపర్‍ వైజర్‍ను అడిగితే రేట్లు పెరిగాయని చెబుతున్నట్లు ఒక  అంగన్‍వాడీ టీచర్ తెలిపారు. కొన్ని కేంద్రాల్లో రెండు మూడు రోజులకు ఒకసారి గుడ్లను సరఫరా చేస్తున్నారని,  అవి కూడా సైజులో చిన్నవిగా ఉంటున్నాయని చెప్పారు.    అంగన్వాడీలకు సరఫరా చేస్తున్న  పాలు కూడా నాణ్యతగా ఉండడంలేదని చెబుతున్నారు.  అంగన్‍వాడీ కేంద్రాల్లోని చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు 200 మిల్లీమీటర్ల చొప్పున పాలు, అన్నం, పప్పు, కూరలు ఇవ్వాల్సి ఉంటుంది. వారానికి మూడుసార్లు కచ్చితంగా ఆకుకూరలు అందజేయాలి. ధరల హెచ్చు, తగ్గులతో సంబంధం లేకుండా గుడ్లను అందించాలని కాంట్రాక్టర్‍తో చేసుకున్న ఒప్పందాల్లో ఉన్నట్లు అధికారులు చెప్పారు. గతంలో గుడ్ల క్వాలిటీ  అవకతవకలపై పలు ఆరోపణలు రావడంతో ఒక్కో వారానికి ఒక్కో రంగు చొప్పున నిర్ణయించి  ఆ రంగు స్టాంపును గుడ్డుపై ముద్రిస్తున్నారు. అంగన్‍వాడీ కేంద్రాల్లో అందించే ఒక్కో గుడ్డు కనీసం 52 గ్రాముల బరువు ఉండాలన్న నిబంధనలు కూడా ఉన్నాయి.  కానీ కాంట్రాక్టర్లు అంతకన్నా తక్కువ బరువుతో ఉన్న గుడ్లను సరఫరా చేస్తున్నట్లు  చెబుతున్నారు.బహిరంగ మార్కెట్‍లో  కొన్ని రోజులుగా  కోడి గుడ్ల ధరలు పెరిగాయి. గుడ్డు ధర టోకు మార్కెట్‌‌లో  రూ.6కు చేరడంతో కాంట్రాక్టర్లు గుడ్ల సరఫరాకు గండి కొడుతున్నారు.   కొన్ని కోళ్ల ఫారాలలో గుడ్ల ఉత్పత్తి తగ్గిన క్రమంలో నెల రోజులుగా అంగన్‌‌వాడీ కేంద్రాలకు గుడ్ల సరఫరా తగ్గినట్లు కాంట్రాక్టర్లు చెబుతున్నారు.  కొన్ని చోట్ల తమకు బిల్లులు సక్రమంగా చెల్లించడం లేదని  కొందరు కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి అంగన్‌‌వాడీ కేంద్రాలకు కోడిగుడ్లు  సక్రమంగా పంపిణీ చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అంగన్‍వాడీ టీచర్లు  కోరుతున్నారు.జిల్లాలోని 5 ప్రాజెక్టుల పరిధిలో మొత్తం 912 అంగన్‍వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిల్లో చార్మినార్‍ ప్రాజెక్టులో అత్యధికంగా 257 కేంద్రాలు పనిచేస్తున్నాయి. గోల్కోండ ప్రాజెక్టు పరిధిలో 154, ఖైరతాబాద్‍ ప్రాజెక్టులో 141, నాంపల్లి ప్రాజెక్టులో 191, సికింద్రాబాద్‍ ప్రాజెక్టు పరిధిలో 169 అంగన్‍వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటికి తోడు సికింద్రాబాద్‍ ప్రాజెక్టులో 2 మినీ  కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం 59,443 మంది చిన్నారులు, గర్భిణులు, బాలింతలు సేవలు పొందుతున్నట్లు అధికారులు తెలిపారు

No comments:

Post a Comment