Breaking News

13/12/2019

ఆసరా వయస్సు తగ్గింపు

పెద్ద ఎత్తున దరఖాస్తులు
హైద్రాబాద్, డిసెంబర్ 13, (way2newstv.in)
జిలాల్లో ఆసరా వృద్దాప్య పింఛన్ల వయోపరిమితి సడలింపుతో భారీగా దరఖాస్తులు వచ్చినట్లు జిల్లా సంక్షేమ అధికారులు వెల్లడిస్తున్నారు. గత ఆరునెల కాలంలో గ్రేటర్ పరిధిలో 1.10లక్షల వరకు వృద్దులు ప్రజావాణి, ఆన్‌లైన్ ద్వారా సమర్పించినట్లు పేర్కొంటున్నారు. ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి వయస్సు సడలింపుకు సంబంధించిన జీవో తమకు రాలేదని, వచ్చిన తరువాత దరఖాస్తులను పరిశీలించి లబ్దిదారులను ఎంపిక చేస్తామంటున్నారు. అధికారుల గణాంకాల ప్రకారం గ్రేటర్ మూడు జిల్లాల పరిధిలో 1.49లక్షలమంది వృద్దాప్య పింఛన్ లబ్దిదారులు ఉండగా హైదరాబాద్ జిల్లాలో 59,620, రంగారెడ్డిలో 58,480, మేడ్చల్ పరిధిలో 31,465 వృద్దులు ఆసరా ఫించన్లు పొందుతున్నారు.
ఆసరా వయస్సు తగ్గింపు

వీరికి నెలకు రూ. 2016 చొప్పున ప్రతి నెలా బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నారు. సడలింపు కారణంగా వీటి సంఖ్య రెండింతలు పెరగవచ్చని భావిస్తున్నారు. గ్రేటర్ పరిధిలో సుమారు 4లక్షల మందికి పించన్ వర్తించే అవకాశముంది. జీహెచ్‌ఎంసీ యూసిడీ విభాగం ఓటర్ల జాబితా, సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా 57ఏళ్ల నుంచి 64 సంవత్సరాల వారిని గుర్తించి ప్రాథమిక జాబితా రూపొందించింది. దాని ప్రకారం సుమారు 4లక్షల మంది అర్హులుగా ఉండవచ్చని చెబుతున్నారు. నాలుగేళ్ల కితం నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల జాబితాను పరిగణలోకి తీసుకుంటే సంఖ్య పెరుగుతారని అంచనా వేస్తున్నారు.ప్రభుత్వం నుంచి జనవరి మొదటి వారంలో కొత్త జీవో వచ్చే అవకాశం ఉందని, వస్తే వెంటనే దరఖాస్తులను పూర్తిస్దాయిలో పరిశీలిస్తామని, సంవత్సరానికి ఆదాయం 2లక్షల లోపు ఉండాలి, సొంత ఇళ్ల లేనివారికి, ప్రభుత్వం నుంచి ఏవిధంగా నెలవారీగా లబ్దిపొందని వారై ఉండాలని, అదే విధంగా వయస్సు గుర్తించడంలో వారి జన్మదృవీకరణ పత్రాలు, ఆధార్‌కార్డు, ఈరెండు లేకుండా వారి పిల్లల పుట్టిన, మనుమరాళ్ల పెళ్లి తేదీలను ఆధారం చేసుకుని అర్హులను ఎంపిక చేస్తామని వెల్లడిస్తున్నారు. అదే విధంగా లబ్దిదారులు ఫించన్లు ఇప్పిస్తామని దళారులు బస్తీల్లో తిష్టవేసి మోసాలు చేస్తున్నట్లు తమకు పలుమార్లు ఫిర్యాదులు వచ్చాయని వారి మాటలు నమ్మవద్దని, అర్హులైన సాంకేతిక కారణాలతో రాకుంటే స్దానికంగా ఉండే రెవెన్యూ అధికారులను కలిసి వివరిస్తే ఫించను మంజూరు చేస్తామంటున్నారు.

No comments:

Post a Comment