సూర్యాపేట డిసెంబర్ 5 (way2newstv.in)
సూర్యాపేట జిల్లా గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రంలో ప్రపంచ నేలల దినోత్సవం సంధర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విద్యుత్ శాఖా మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి హజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా విత్తనశుద్ధి కేంద్రాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రారంభించరు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, కలెక్టర్ అమయ్ కుమార్ ఇతరులు హజర్యారు. మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ మనం చేసే పనుల వల్ల భూమి చనిపోతుంది. అది చేయొద్దన్న ఉద్దేశంతోనే ఇలా ప్రపంచ నేలల దినోత్సవం జరుపుకోవాల్సి వస్తుందని అన్నారు. పంటలు పండించే క్రమంలో అవసరానికి మించి ఎరువుల వాడకం మూలంగా భూమి నశిస్తుంది. రైతులను చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది.
రైతులకు చైతన్యపరచాలి
అవగాహన లేక రైతులు అడ్డగోలుగ ఎరువు వాడుతున్నారు .. వారికి చెప్పకపోవడం తెలిసిన వారి తప్పని అన్నారు. రైతులు పొలం కోసిన తరువాత భూమిని కాల్చొద్దు .. దానితో నేల స్వభావం కోల్పోయి అనేక లక్షణాలు కోల్పోతుంది. భూ సంరక్షణకు అందరం అంకితమై పనిచేద్దామని అన్నారు. భూమి తప్ప మానవుడు నివసించ గలిగేందుకు ఏ గ్రహం అనుకూలంగా లేదు. ఇప్పటి వరకు ప్రపంచంలో జరిగిన అన్ని పరిశోధనలలో తేలింది ఇదేనని అన్నారు. మానవునితో పాటు సృష్టిలోని జీవులన్నింటి మనుగడకు అనుకూలంగా ఉన్నది భూగ్రహం ఒక్కటే. భూమిని కాపాడుకోవడం గురించి రాబోయే తరాలకు అవగాహన కల్పించాలి. మానవాళి అనేక రకాల ప్రత్యామ్నాయ సంపదను సృష్టించుకోగలిగింది. అయితే ప్రపంచంలో ఆహారానికి ప్రత్యామ్నాయం సృష్టించుకోలేకపోయింది .. అది సాధ్యం కాదు కూడా అని అన్నారు.మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ఆహారం కావాలంటే వ్యవసాయం జరగాలి .. భూమిని కాపాడుకోవాలి. మనిషి భూమి చుట్టూ తిరగాల్సిందే .. అది అలా ఆకర్షిస్తుంది. భూమి ఈ దేశంలో దాదాపు 55 - 60 శాతం మందికి ఉపాధి కల్పిస్తుంది. మానవులు పనిలో నిమగ్నమయి ఉంటే ఆ ప్రాంతం, ఆ దేశం ప్రశాంతంగా ఉంటుంది .. పనిలేని వారున్న ప్రాంతాలలో అలజడి అశాంతి చెలరేగుతుందని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగమే ఉద్యోగం, పని అన్న భ్రమలు మనకు కల్పించారు. వ్యవసాయం సుస్థిరంగా ఉంటే అందరూ బాగుంటారన్న దూరదృష్టితో , దార్శనికతతో ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యధిక శాతం బడ్జెట్ లో నిధులను వ్యవసాయ రంగానికి కేటాయించారు. దాదాపు రూ.72 వేల కోట్లు రైతు బంధు, రైతు భీమా, ప్రాజెక్టుల నిర్మాణం, ఉచిత కరంటు సరఫరా వంటి వాటికి కేటాయించారు. అమెరికా లో ఓ రైతు 80 వేల డాలర్లు కరంటు బిల్లు కడుతున్నారు .. మన వద్ద ఉచిత కరంటు ఇస్తున్నాం అంటే ఆశ్చర్యపోయారని అన్నారు. జర్మనీలో మాత్రం రెండున్నర ఎకరాలకు 280 యూరోలు సర్కారు ఇస్తుంది .. అయితే ప్రభుత్వ నిబంధనలను అధిగమిస్తే అంతకు మూడు రెట్లు జరిమానా చెల్లించాలి. తెలంగాణ లో ప్రభుత్వం సాగునీరు, ఉచిత కరంటు, రైతుబంధు, రైతు భీమా, వ్యవసాయ యాంత్రీకరణతో వ్యవసాయానికి సహకారం అందిస్తుంది. రైతులు కేవలం వరి సాగు మీదనే దృష్టిపెట్టొద్దు .. ఇతర పంటల మీద దృష్టి సారించాలని కోరుతున్నాను. సమీప పట్టణాల అవసరాలను గుర్తించి రైతులు పంటల సాగును ఎంచుకోవాలి. నూనెగింజల సాగు మీద రైతులు దృష్టి సారించాలి .. దీనికి ప్రభుత్వం సబ్సిడీలు కూడా ఇస్తుంది. అయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తాం .. తెలంగాణ లో 206 మండలాలు సాగుకు అనుకూలం. తెలంగాణ సమశీతోష్ణ మండలం .. దేశ అవసరాలను తీర్చగలిగే రాష్ట్రం తెలంగాణనే అని అన్నారు.
No comments:
Post a Comment