హైదరాబాద్ డిసెంబర్ 20 (way2newstv.in)
విద్యుత్ పొదుపుపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ఇంజినీరింగ్ కన్జర్వేషన్ అవార్డుల ప్రదానోత్సవం నేడు నగరంలో జరిగింది. ఈ అవార్డుల ప్రదానోత్సవానికి గవర్నర్ తమిళిసై, మంత్రి జగదీశ్‌రెడ్డి, ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేవలం 6 నెలల్లోనే విద్యుత్ కోతలు లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు.
విద్యుత్ పొదుపుపై ప్రజలకు మరింత అవగాహన: జగదీశ్‌రెడ్డి
రైతులకు ఇచ్చిన హామీ మేరకు 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. దేశంలో రైతులకు 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అన్నారు. అవసరం లేనిచోట విద్యుత్ వినియోగం తగ్గించి ఆదా పాటించాలన్నారు. విద్యుత్ పొదుపు అత్యంత కీలకమైన విషయమని.. విద్యుత్ పొదుపుపై అవగాహన కల్పించాలని మంత్రి పేర్కొన్నారు.
No comments:
Post a Comment