Breaking News

20/12/2019

విద్యుత్ పొదుపు ఒక్కటే కాదు.. నీటిని కూడా పొదుపు చేయాలి: గవర్నర్

హైదరాబాద్ డిసెంబర్ 20 (way2newstv.in)
విద్యుత్ పొదుపు ఒక్కటే కాదు.. నీటిని కూడా పొదుపు చేయాలి. ఈ మేరకు విద్యార్థులు, ప్రజలకి విద్యుత్, నీటి పొదుపుపై అవగాహన కలిగించాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు.నగరంలోని విశ్వేశ్వరయ్య భవన్‌లో తెలంగాణ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం నేడు జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి జగదీశ్‌రెడ్డి, గవర్నర్ తమిళిసై పాల్గొన్నారు. 
 విద్యుత్ పొదుపు ఒక్కటే కాదు.. నీటిని కూడా పొదుపు చేయాలి: గవర్నర్

ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. విద్యుత్ పొదుపు అవార్డులు అందుకున్న వారికి అభినందనలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ పొదుపు ఎక్కువగా చేస్తున్నారన్నారు. హైదరాబాద్ నగరంలో ఎక్కడ చూసినా ఎల్‌ఈడీ బల్బ్‌లు వాడుతున్నారు ఇది శుభపరిణామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం ఇంజినీరింగ్ అద్భుతమన్నారు. సీఎం కేసీఆర్ చాలా గొప్పగా హరితహారం కార్యక్రమం చేపడుతున్నరని తెలిపారు.

No comments:

Post a Comment