Breaking News

13/12/2019

సెక్యూరిటీ డ్రిల్ను అధికారులు ఫాలో అయ్యారు

సమూహంగా వస్తే సభ్యులను గుర్తించటానికి ఆపారు
సెక్యూరిటీ సిబ్బందితో ప్రతిపక్ష నేత తీరు సరికాదు
- శాసనసభ, ఆర్థిక శాఖామాత్యులు బుగ్గన రాజేంద్రనాథ్
అమరావతి డిసెంబర్ 13 (way2newstv.in)
గురువారం  జరిగిన సంఘటనపై మొదట్లో ఆ వీడియో క్లిప్పులు చూసినప్పుడు అంత క్లియర్గా సంభాషణ, భాష అప్పుడు అర్థం కాలేదని బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. కానీ ఇప్పుడు ఆ వీడియోలు చూస్తే ఎంతో దారుణం అని బుగ్గన  రాజేంద్రనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక చీఫ్ మార్షల్ను, ఇతర అధికారులను, సభ్యులకు భద్రత కల్పించేవారిని పట్టుకొని చంద్రబాబు వ్యవహరించేది వ్యవహరించేదని ఇలానా అని బుగ్గన ప్రశ్నించారు. సెక్యూరిటీ వాళ్లు  చేసిన పాపం అంతా సెక్యూరిటీ డ్రిల్ ప్రకారం ఫాలో అవటమేనా అన్నారు. ఒక సమూహం గుమ్మిగూడి శాసనసభలోకి వస్తే యాక్సెస్ కంట్రోల్ చేసి ఎవరు సభ్యులో వారిని మాత్రమే లోపలికి అనుమతించాలి అనేది సెక్యూరిటీ  డ్రిల్ చెబుతోందని బుగ్గన వివరించారు. 
సెక్యూరిటీ డ్రిల్ను అధికారులు ఫాలో అయ్యారు

అయితే దాన్ని పట్టించుకోకుండా.. ఒరేయ్.. ఎవ్వర్రా నువ్వు? ఒరేయ్ అన్ఫిట్.. అని అనటం, అంతటితో వదిలిపెట్టకుండా.. బాస్టర్డ్ అనటం ఎంతదారుణం అని బుగ్గన మండిపడ్డారు.  యూజ్లెస్ ఫెలో అని ఒకరు అంటే, మరొకరు వచ్చి తోస్తే.. ఇంకొకరు వచ్చి షర్ట్ కాలర్ పట్టుకుంటారని బుగ్గన ఆ ఘటనలను తెలిపారు. తనకు తెల్సి ఏ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇలా జరిగి ఉండవని బుగ్గన అన్నారు. గత సభలో  ప్రతిపక్షనాయకులకు ఎంత అవమానం జరిగినా లోపలికి రానివ్వకపోయినా హుందాగా బయట కూర్చున్నాం తప్ప కించిత్ ఒక్కమాట కూడా అనలేదని గుర్తు చేశారు. అప్పటి ప్రతిపక్ష నాయకులు ఒకసారి సభలోకి వస్తుంటే  లోపలికి రానివ్వకపోతే అందరం బయట కూర్చున్నామన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక వ్యక్తిని ఒక్కరోజు ప్రతిపక్షనేత కానీ సభ్యుడు ఒరేయ్ అన్నమాట అనలేదని బుగ్గన అన్నారు. ఇదేం భాష అని బుగ్గన ఆశ్చర్యం వ్యక్తం  చేశారు.  ఏపీ రాష్ట్ర చరిత్రలో ఏనాడూ ఇలాగా జరగలేదని గతంలో ఆర్కే రోజా, చెవిరెడ్డి భాస్కరరెడ్డిని బయట ఎత్తి పడేస్తే.. ఆసుపత్రిలో చేరారని గుర్తు చేశారు. గతంలో ఎన్నో అవమానాలు జరిగాయని బుగ్గన తెలిపారు. ఈ  సందర్భంగా నిన్నటి ఘటనలో మార్షల్కు తగిలిన దెబ్బలు, తోసినవి, లోకేశ్ సెక్యూరిటీ గొంతు పట్టుకొన్న ఫొటోలను బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చూపించారు.జరిగిన ఘటనపై ఇప్పటికీ పశ్చాత్తాపం లేదు. పొరపాటు అయిందని గానీ చెప్పడం లేదు. పైగా ప్రతిపక్షం ఎదురుదాడి చేస్తోందని బుగ్గన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఏపీ రాష్ట్ర ప్రజలు ఎవరైనా నిన్నటి ఘటనపై మీడియా రిపోర్టింగ్  చూస్తే ఎంతటి అన్యాయం జరిగింది. ప్రతిపక్షాన్ని లోపలికి రానివ్వలేదు. కాబట్టి ధర్నా చేశారని అనుకునేలా ఉందని అన్నారు. వాస్తవం ఏమిటి అంటే.. తను రావాల్సిన రూట్లో ప్రతిపక్ష నేత చంద్రబాబు రాకుండా జనాన్నివేసుకొని హౌస్ మీదకు వస్తుంటే సెక్యూరిటీ వాళ్లు తమ డ్యూటీ చేస్తుంటే ఒరేయ్.. అన్ఫిట్ ఫెలో, యూజ్లెస్ ఫెలో, బాస్టర్డ్, షర్ట్ కాలర్ పట్టుకోవటం చేశారని బుగ్గన కడిగేశారు. పేపర్లు చదివితే ప్రతి దాన్నీ వక్రీకరించాయని బుగ్గన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈరోజు ఈ వీడియోలు చూస్తే ఎంతో క్లియర్గా కనబడుతోందని మనకు భద్రత ఇవ్వాల్సిన వారితో వ్యవహరించిన తీరు బట్టబయలైందని బుగ్గన తెలిపారు. ఎలాంటి సంకేతాలను సభ్యులుగా మనం పంపిస్తున్నామని బుగ్గన ప్రశ్నించారు. దీనిపై సభ దీనిపై నిర్ణయం తీసుకోవాలన్నారు. ఈ ఘటన ... సభ మీద, స్పీకర్ మీద, ఏపీ రాష్ట్ర ప్రజల మీద జరిగిందని బుగ్గన అన్నారు. దీనికి తగిన నిబంధనల ప్రకారం.. చట్టం ప్రకారం, రూల్స్ ప్రకారం.. ఏ చర్యలు తీసుకోవాలో స్పీకర్కే సభ నిర్ణయాధికారం వదిలిపెడుతోందన్నారు. ఏం చర్యలు చేపట్టాలో.. చట్ట ప్రకారం తీసుకొని ఇకపై ఎవ్వరూ ఇటువంటి చర్యలకు పాల్పడకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని సభ అంతా తీర్మానం చేస్తోందని బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు.అసలు చంద్రబాబు నాయుడు ఉన్మాది అనటం కరెక్టా? ఒరేయ్ యూజ్లెస్ ఫెలో అనటం కరెక్టా? రాస్కెల్ అనటం కరెక్టా? బాస్టర్డ్ అనటం కరెక్టా? బాస్టర్డ్ అనేదానికి తెలుగులో ఏ అనువాదం వస్తుంది. ఇవన్నీ వాడేమాటలేనా?  మనిషిని తోయటం కరెక్టా? మనిషిని గొంతుపట్టుకోవటం కరెక్టా? వీటన్నింటికీ ప్రతిపక్షనేత చంద్రబాబు సమాధానం చెప్పాలని బుగ్గన డిమాండ్ చేశారు. ఇప్పటికే చంద్రబాబు అన్నారా..  తోశారా లేదా అన్నది వీడియోలతో  రుజువు అయిపోయింది. అది కరెక్ట్ అయితే పశ్చాత్తాపం ఏవిధంగా తెలియపరుస్తారో చెప్పాలని బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి కోరారు.మరోసారి చంద్రబాబు ఉన్మాది అన్న వీడియోను, అధికారులను లోకేశ్, చంద్రబాబు తిట్టిన వీడియోలు సభలో ప్లే  చేశారు. బాబు అన్న మాటలు అందరూ విన్నారు. దీనిపై చంద్రబాబు క్లారిటీ ఇవ్వాలని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి  కోరారు. ఎంతో క్లియర్గా తలుపు తీయి.. బాస్టర్డ్.. అసెంబ్లీకి పోకూడదా.. ఇంత క్లియర్గా చంద్రబాబు అన్నారు. తర్వాత తోయటం లోకేశ్ నాయుడు యూజ్లెస్ ఫెలోస్ అనటం, గొంతుపట్టుకోవటం, ఇంకో సభ్యుడు కాలర్ పట్టుకోవటం దుర్మార్గం. రాష్ట్రం ఏమైపోతుంది. ప్రతిపక్ష నాయకులు క్లారిటీ ఇవ్వాలి. ఈ పదజాలం ఇదంతా వాడటం కరెక్టా? బాస్టర్డ్ అనేపదాన్ని అనువాదం చేస్తే ఎంత దూరం వెళ్లిపోతుందని బుగ్గన మండిపడ్డారు.

No comments:

Post a Comment