Breaking News

11/12/2019

బ్యాక్‌ వాటర్‌తో పాపికొండలను తలపిస్తున్న సిరిసిల్ల శివారు: కేటీఆర్

హైదరాబాద్ డిసెంబర్ 11 (way2newstv.in)
గోదావరి బ్యాక్‌ వాటర్‌తో సిరిసిల్ల శివారు పాపికొండలను తలపిస్తున్నది. సిరిసిల్ల జలకళను సంతరించుకున్న తరుణంలో.. గోదారమ్మ పరవళ్లతో రైతుల కళ్ళలో చేరగనీ సంతోషం నిండుకున్నది అని కేటీఆర్ ట్వీట్ చేశారు. తెలంగాణను కోటి ఎకరాలను మాగాణంగా.. మార్చేందుకు వేసిన జల బాటలు.. అని ట్వీట్ చేసిన కేటీఆర్.. శ్రీరాజరాజేశ్వర ప్రాజెక్టు బ్యాక్ వాటర్ కు సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు. గోదావరి బ్యాక్ వాటర్ సిరిసిల్ల శివారుకు చేరుకోవడం సంతోషంగా ఉందని, సిరిసిల్ల ఎమ్మెల్యేగా గర్వపడుతున్నానని కేటీఆర్ పేర్కొన్నారు.
బ్యాక్‌ వాటర్‌తో పాపికొండలను తలపిస్తున్న సిరిసిల్ల శివారు: కేటీఆర్

అపరభగీరథుడు సీఎం కేసీఆర్ సంకల్పబలంతో గోదావరి మేడిగడ్డ నుంచి బరాజ్‌లు, పంప్‌హౌస్‌లు దాటుకుంటూ శ్రీరాజరాజేశ్వర (మధ్యమానేరు) జలాశయాన్ని నిండుకుండలా మార్చి, మానేరు వాగు మీదుగా ఎదురెక్కింది. మేడిగడ్డ నుంచి 172 కిలోమీటర్ల దూరంలో మెట్ట ప్రాంతమైన రాజన్న సిరిసిల్ల జిల్లాను ముద్దాడింది. సముద్రమట్టానికి దాదాపుగా 1,250 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతానికి గోదావరి జలాలు రావడం చరిత్రను తిరగరాసినట్లయింది. మరోవైపు కాళేశ్వరం జలాల రాకతో శ్రీరాజరాజేశ్వర జలాశయం జలకళను సంతరించుకొన్నది. నంది, గాయత్రి పంప్‌హౌస్‌ల మీదుగా గోదావరి తరలి వస్తుండడంతో నీటిమట్టం క్రమంగా పెరుగుతున్నది. ప్రాజెక్టు సామర్థ్యం 25.873 టీఎంసీలు కాగా, మంగళవారం సాయంత్రం ఆరు గంటల వరకు 23.109 టీఎంసీలకు చేరింది.

No comments:

Post a Comment