Breaking News

12/12/2019

తగ్గుతున్న బంగారం ధరలు

ముంబై, డిసెంబర్ 12 (way2newstv.in)
పసిడి ధర మళ్లీ పడిపోయింది. హైదరాబాద్ మార్కెట్‌లో గురువారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.40 తగ్గింది. దీంతో ధర రూ.39,170కు క్షీణించింది. అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్ సహా కూడా దేశీ జువెలర్లు, కొనుగోలుదారుల నుంచి డిమాండ్ మందగించడం ఇందుకు కారణమని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. అదేసమయంలో 10 గ్రాముల 22 కార్యెట్ల బంగార ధర కూడా రూ.30 పడిపోయింది. దీంతో ధర రూ.35,910కు తగ్గింది. ఇకపోతే బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర రూ.90 దిగొచ్చింది. దీంతో వెండి ధర రూ.47,400కు తగ్గింది.ఢిల్లీ మార్కెట్‌లో మాత్రం బంగారం ధర పరిస్థితి వేరేలా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. రూ.37,900 వద్దనే కొనసాగుతోంది. అదేసమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర స్థిరంగా ఉంది. 
తగ్గుతున్న బంగారం ధరలు

రూ.36,700 వద్దనే నిలకడగా కొనసాగుతోంది. పసిడి నిలకడగా ఉంటే వెండి ధర మాత్రం పడిపోయింది. ధర కేజీకి రూ.90 తగ్గుదలతో రూ.47,400కు తగ్గింది.ఇకపోతే అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గింది. ఔన్స్‌కు 0.02 శాతం తగ్గుదలతో 1,478.95 డాలర్లకు క్షీణించింది. అదేసమయంలో వెండి ధర ఔన్స్‌కు 0.02 శాతం పెరుగుదలతో 16.92 డాలర్లకు ఎగసిందిఇకపోతే గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర సెప్టెంబర్ నెలల్లో ఏకంగా ఆరేళ్ల గరిష్ట స్థాయి (ఔన్స్‌కు 1,550 డాలర్లకు) చేరిన విషయం తెలిసిందే. అమెరికా, చైనా మధ్య నెలకొన్ని వాణిజ్య ఉద్రిక్తతలు ఇందుకు కారణం. అయితే అప్పటితో పోలిస్తే ఇప్పుడు బంగారం ధర కింది స్థాయిల్లోనే కదలాడుతోంది.సాధారణంగా ఈ ఏడాది చివరికల్లా చైనాతో అమెరికా వాణిజ్య డీల్ ఓకే కావొచ్చనే అంచనాలు ఇప్పటిదాకా కొనసాగుతూ వచ్చాయి. డిసెంబర్ 15 నుంచి చైనా దిగుమతులపై అమెరికా కొత్త టారిఫ్‌లు అమలులోకి రానున్నాయి. ఈలోపు డీల్ ఓకే కావొచ్చని అందరూ భావిస్తున్నారు. అందుకే బంగారంపై ప్రతికూల ప్రభావం పడింది.బంగారం ధర అంతర్జాతీయ మార్కెట్‌లో గత వారంలో నెల గరిష్ట స్థాయికి తాకింది. అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందంపై నెలకొన్ని అస్థిర పరిస్థితులు ఇందుకు ప్రధాన కారణం. బంగారం ధర ఔన్స్‌కు 1484 డాలర్లకు ఎగసింది. ఇది పసిడికి నెల గరిష్ట స్థాయి.అంతర్జాతీయ ట్రేడర్లు, ఇన్వెస్టర్లు ఇప్పుడు అమెరికా ఫెడరల్ రిజర్వు మీటింగ్‌పైనే దృష్టి కేంద్రీకరించారు. ఫెడ్ రెండు రోజుల మీటింగ్ ప్రారంభమైంది. ఫెడరల్ రిజర్వు ఈసారి వడ్డీ రేట్లను తగ్గించకపోవచ్చనే అంచనాలు ఉన్నాయి. ఫెడ్ రేటు స్థిరంగా కొనసాగవచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఇప్పుడు ఫెడ్ రేటు 1.5 శాతం నుంచి 1.75 శాతం మధ్యలో ఉంది.మరోవైపు దేశీ మార్కెట్‌లో బంగారం ధర ఈ ఏడాది దాదాపు 19 శాతం పరుగులు పెట్టింది. బంగారంపై దిగుమతి సుంకాల పెంపు, అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి బలహీనపడటం, అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర పరుగులు పెట్టడం వంటి పలు అంశాలు ఇందుకు ప్రధాన కారణం.బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి

No comments:

Post a Comment