కారు కొంటే రూ.లక్షన్నర తగ్గింపు!
ముంబై, డిసెంబర్ 3 (way2newstv.in)
కొత్త కారు కొందామని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు శుభవార్త. దేశీ ప్రముఖ వాహన తయారీ కంపెనీ టాటా మోటార్స్ తాజాగా ఇయర్ ఎండ్ స్టాక్ క్లియరెన్స్ సేల్ ప్రకటించింది. ఇందులో భాగంగా కొత్త కారు కొనాలని ప్లాన్ చేసే వారికి ఏకంగా రూ.1.65 లక్షల వరకు తగ్గింపు ప్రయోజనాలు లభిస్తాయి.టాటా మోటార్స్ పలు మోడళ్లపై కళ్లుచెదిరే తగ్గింపు అందిస్తోంది. కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్ టియాగో కారుపై మొత్తంగా రూ.75,000 తగ్గింపు లభిస్తోంది. మరోవైపు టిగోర్ కారుపై రూ.లక్ష వరకు ప్రయోజనాలు పొందొచ్చు.సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ నెక్సన్ మోడల్‌పై ఏకంగా రూ.1.07 లక్షల తగ్గింపు అందుబాటులో ఉంది. ఇక హెక్జా మోడల్‌పై 1.65 లక్షల వరకు బెనిఫిట్ పొందొచ్చు. కాంపాక్ట్ ఎస్‌యూవీ హారియర్ కారుపై రూ.65,000 వరకు ప్రయోజనాన్ని సొంతం చేసుకోవచ్చు.
వచ్చేసిన ఇయర్ ఎండ్ ఆఫర్లు
కంపెనీ రానున్న రోజుల్లో మూడు కొత్త మోడళ్లను మార్కెట్‌లోకి తీసుకువచ్చేందుకు రెడీ అవుతోంది. కంపెనీ ఇప్పటికే ఆల్ ఎలక్ట్రిక్ నెక్సన్ మోడల్‌ను లాంచ్ చేసేందుకు సన్నద్ధమైంది. జనవరి నెలలో ఈ కారును ఆవిష్కరించనుంది. అదే నెలలో ఆల్ న్యూ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ అల్ట్రోజ్ మోడల్‌ను లాంచ్ చేయనుంది. ఇక ఫిబ్రవరి నెలలో గ్రావిటస్మోడల్‌ను తీసుకురాబోతోంది.టాటా నెక్సన్ ఈవీ మోడల్ కంపెనీకి చెందిన కొత్త జిప్‌ట్రోన్ ఎలక్ట్రిక్ వెహికల్ ప్లాట్‌ఫామ్‌పై రూపొందుతోంది. tata nexon ev కారుకు ఒక్క సారి చార్జింగ్ పెడితే ఏకంగా 300 కిలోమీటర్లు వెళ్తుందని కంపెనీ పేర్కొంది. ఈ కారుకు ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్ కూడా ఉంటుందని తెలిపింది. అలాగే ఇంటి వద్ద కూడా చార్జింగ్ పెట్టుకునే ఆప్షన్ ఉంటుందని పేర్కొంది.గ్రావిటస్ విషయానికి వస్తే.. హారియర్ ఎస్‌యూవీ 7 సీటర్ వెర్షన్ ఇది. హారియర్ రూపొందిన ప్లాట్‌ఫామ్‌పై ఈ మోడల్‌కు తయారౌతోంది. వీల్‌బేస్ కూడా రెండింటికీ ఒకటే. అయితే గ్రావిటస్ పొడవు కొంత పెరుగుతుంది. ఇకపోతే గ్రావిటస్ మోడల్ ధర రూ.14 లక్షల నుంచి ప్రారంభ కావొచ్చు. గరిష్టంగా ధర రూ.18 లక్షల వరకు ఉండొచ్చు.
No comments:
Post a Comment