Breaking News

20/12/2019

జేసీపై మండిపడ్డ ఎంపీ మాధవ్

అనంతపురం డిసెంబర్ 20, (way2newstv.in)
పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డిపై హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ మండిపడ్డారు. శుక్రవారం తన నివాసంలో మీడియాతో మాట్లాడిన మాధవ్, జేసీ వ్యాఖ్యలను ఖండించారు. జేసీ మాటలకు కౌంటర్గా.. అమర పోలీసు బూటును మాధవ్ ముద్దాడారు. దేశ రక్షణకు పోలీసులు ప్రాణాలు అర్పిస్తున్నారని.. అలాంటి పోలీసులపై జేసీ దివాకర్రెడ్డి జుగుప్సాకరంగా మాట్లాడరని మండిపడ్డారు.  గతంలో పోలీసులపై వ్యాఖ్యలు చేస్తే జేసీని ప్రజలు బజారుకీడ్చారని.. రాజకీయ సమాధి కట్టారన్నారు.
జేసీపై మండిపడ్డ ఎంపీ మాధవ్

అనంతపురం జిల్లా సమీక్షా సమావేశంలో బుధవారం మాట్లాడిన జేసీ.. అధికారంలోకి వస్తే తమకు అనుకూలమైన పోలీసులను తెచ్చుకుంటామంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో తన వ్యాఖ్యలపై గురువారం వివరణ ఇచ్చారు. జిల్లాలో పోలీసులు వైసీసీ నాయకుల మాటలు విని తప్పుడు కేసులు పెడుతున్నారన్నారు. తాను చంద్రబాబు సమక్షంలో ఆవేదనతో చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించాల్సిన అవసరం లేదన్నారు. తాను ఏ ఒక్క అధికారినీ ఉద్దేశించి మాట్లాడలేదన్నారు. ఆవేశంలో ఒక మాట జారి ఉంటే ఉండవచ్చన్నారు. అంతే తప్ప వేరే లేదన్నారు. కొందరు పోలీసులు వెన్నెముక లేకుండా పనిచేస్తున్నారనడం తన ఉద్దేశమన్నారు. ఆ రకంగా మాట్లాడానే తప్ప వేరే ఏమీ కాదన్నారు.

No comments:

Post a Comment