హైద్రాబాద్, డిసెంబర్ 20, (way2newstv.in)
తెలంగాణలో రియల్ వ్యాపారం జోరందుకున్నది. దీంతో రిజిస్ట్రేషన్‌ల శాఖ భూముల విలువ పెంచే దిశగా అడుగులువేస్తున్నది. భూమి హక్కుల కల్పన తరువాత ప్రధానంగా ఆదాయ మార్గాల అన్వేషణలో ఆ శాఖ దృష్టి సారించింది. మార్కెట్ విలువను పునః సమీక్షించి సవరించాలని భావిస్తున్నది. అయితే భూముల విలువను పెంచుతూ అప్పటి ప్రభుత్వం నిర్ణ యం గత 2013 ఆగష్టులో తీసుకుంది. టిఆర్‌ఎస్ ప్రభు త్వం అధికారంలోకి వచ్చిననాటి నుంచి ఇప్పటివరకు భూముల మార్కెట్ విలువను పెంచలేదు.నోట్ల రద్దు తరువాత రిజిస్ట్రేషన్‌ల విభాగానికి రాబడి తగ్గిన్నప్పటికీ ఇతర మార్గాల్లో ఆదాయాన్ని పెంచుకోవాలని ఆ విభా గం యోచిస్తున్నది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో రియల్ వ్యాపారం పరిగణలోకి తీసుకుని భూముల విలువను అమాంతం పెంచుతున్నారు.
భారీగా పెరగనున్న రిజిస్ట్రేషన్ చార్జీలు
కంప్యూటర్ ఎయిడెడ్ రిజిస్ట్రేషన్ డిపార్టుమెంట్(కార్డు) ధర కు స్థానికంగా ఉన్న భూముల ధరలకు చాలా వ్యత్యాసం కనిపిస్తున్నది. ఆర్థికమాంద్యం నేపథ్యంలో మార్కెట్ విలువను పెంచాలని రిజిస్ట్రేషన్ విభాగం యోచిస్తున్నది. శాస్త్రీయ పద్ధతిలో భూముల విలువను పెంచడం వలన సామాన్యులకు మేలు కలగడంతో పాటు రాబడి పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.మార్కెట్ విలువకు సంబంధించిన ప్రతిపాదనలకు రియల్టర్‌లు కూడా సానుకూలంగా ఉండటంతో ప్రత్యేక నివేదికను ఆయన సిద్దం చేసినట్టు సమాచారం. వ్యాపార, పట్టణ, గ్రామీణ కేటగిరీలుగా చేసి భూముల విలువ ప్రస్తుతమున్న వాటికంటే మరో 10 నుంచి 100 శాతం వరకు పెంచేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్దం చేశారనేది సమాచారం. దీంతో రిజిస్ట్రేషన్ చార్జీలు, స్టాంపు డ్యూటీ పెరిగే అవకాశాలపైనా దృష్టిలేకపోలేదని స్టాంపులు, రిజస్ట్రేషన్ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.అన్ని రాష్ట్రాల్లోనూ సంవత్సరం లేదా రెండు సంవత్సరాలకోమారు భూముల విలువను పెంచడం పరిపాటి. కానీ తెలంగాణలో భూముల విలువ పెరుగలేదు. . ప్రస్తుతం తెలంగాణలో స్టాంపుడ్యూటీ 6శాతమే ఉంది. ఇదిలా ఉండగా బహిరంగ మార్కెట్ విలువను, కార్డు వ్యా ల్యూను పరిగణలోకి తీసుకొని ఈ రెండింటికి మధ్యస్తంగా భూముల విలువను నిర్ణయించడానికి స్టాంపులు, రిజిస్ట్రేషన్‌శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తు తం విక్రయనామ దస్తావేజులపై స్టాంప్‌డ్యూటీ, ట్రాన్స్‌ఫర్ ఆఫ్ ప్రాపర్టీ, రిజిస్ట్రేషన్‌తో పాటు మొతత 6 శాతం గా ప్రభుత్వం ఫీజును వసూలు చేస్తోంది. జీపీఏ సేల్‌డీడ్‌కు కేవలం 1 శాతం రుసుం రూ.2 వేల ఫీజు మాత్రమే ఉంటుంది. బహిరంగ మార్కెట్‌లో వాస్తవంగా ఉన్న భూ ముల విలువలను ప్రామాణికంగా తీసుకొని రిజిస్ట్రేషన్ చార్జీలకు సంబంధించి ప్రతిపాదనలను సిద్ధం చేసినట్టుగా తెలిసింది.స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలో 2014లో 7,35,000 ల క్షల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కాగా రూ.4 వేల కోట్లకు పైచిలుకు ఆదాయాన్ని సమకూరింది. 2018, 19 సంవత్సరంలో 15,20,000 డాక్యుమెంట్లు కాగా రూ. 5,350 కోట్లను, 2019,20 సంవత్సరానికి చూసుకుం టే ఇప్పటివరకు 12 లక్షల డాక్యుమెంట్లు కాగా రూ.5 వేల కోట్ల రాబడి వచ్చిందని అధికారులు పేర్కొన్నారు.
No comments:
Post a Comment