Breaking News

26/12/2019

చుక్కలు చూపించిన సరయూ రాయ్

రాంచీ, డిసెంబర్ 27  (way2newstv.in)
ఆయన సీనియర్ నేత. సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న నేత. అవినీతికి వ్యతిరేకంగా అలుపెరగని పోరాటం చేసిన లీడర్. ఆయనకున్న పేరు చాలు ఓట్లు రాలడానికి. కానీ భారతీయ జనతా పార్టీ ఆయనను కాదనుకుంది. డెబ్భయి ఏళ్లు దాటాయంటూ పక్కన పెట్టేసింది. ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వడానికి కూడా నిరాకరించింది. ఫలితంగా భారీ నష్టాన్ని బీజేపీ చవిచూడాల్సి వచ్చింది. ఆయనే జార్ఖండ్ బీజేపీ నేత సరయూ రాయ్.ఇప్పుడు సరయూ రాయ్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోతుంది. సరయూ రాయ్ ఆర్ఎస్ఎస్ భావాజాలంతో రాజకీయాల్లోకి వచ్చారు. బీహార్ విడిపోక ముందు ఆయన అవినీతిపై అలుపెరగని పోరాటం చేశారు. బీజేపీలో చేరిన తర్వాత అప్పటి బీహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, జగన్నాధ్ మిశ్రాల అవినీతిపై న్యాయస్థానంలో పోరాడారు. 
చుక్కలు చూపించిన సరయూ రాయ్

లాలూ ప్రసాద్ యాదవ్ గడ్డి కుంభకోణాన్ని వెలికితీసింది సరయూరాయ్. లాలూ యాదవ్ ఈరోజు జైల్లో మగ్గుతున్నారంటే అందుకు కారణం సరయూ రాయ్. అలాగే బొగ్గు కుంభకోణంలో అప్పటి జార్ఖండ్ ముఖ్యమంత్రి మధుకోడాను ఊచలు లెక్కపెట్టేలా చేసింది కూడా సరయూ రాయ్.బీహార్ విడిపోయి జార్ఖండ్ ఏర్పడిన తర్వాత బీజేపీలో సరయూ రాయ్ క్రియాశీల పాత్రను పోషించారు. గత ప్రభుత్వంలో మంత్రివర్గ సభ్యుడిగా పనిచేశారు. అయితే అప్పటి ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ అమలు చేస్తున్న కొన్ని కార్యక్రమాలను మంత్రిగా ఉంటూనే వ్యతిరేకించారు. మూడు సార్లు బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచారు. గత ముఖ్యమంత్రి రఘుబార్ దాస్ పర్యవరణానికి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాలను సరయూ రాయ్ తప్పుపట్టారు. రఘుబర్ దాస్ కు సరయూరాయ్ కొరకరాని కొయ్యగా తయారయ్యారు.ఈ విషయం రఘుబర్ దాస్ అనేక సార్లు బీజేపీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. అయితే అవినీతికి వ్యతిరేకంగా సరయూ రాయ్ పోరాడుతుండటం, ఆయనకు ఉన్న మంచి పేరు దృష్ట్యా చర్యలు తీసుకునేందుకు అధిష్టానం వెనకడుగు వేసింది. ఆయన పట్ల సానుకూలంగా ఉన్నట్లు ఎన్నికలకు ముందు వరకూ వ్యవహరించింది. చివరకు జంషెడ్ పూర్ వెస్ట్ టిక్కెట్ ను సరయూ రాయ్ కు బీజేపీ ఇవ్వలేదు. డెబ్బయి ఏళ్లు నిండాయన్న సాకుతో ఆయనను పక్కన పెట్టింది. దీంతో ఆయన అదే నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ముఖ్యమంత్రి రఘుబర్ రదాస్ ను ఓడించారు. అవినీతిపై దశాబ్దాలుగా పోరాటం చేస్తున్న సరయూ రాయ్ కు పార్టీ అండగా నిలవకపోయినా ప్రజలు పట్టం కట్టారు. దటీజ్ సరయూ రాయ్

No comments:

Post a Comment