Breaking News

26/12/2019

ఏపీలో రాజకీయం వేడి.. ఎంపీ కేశినేని నాని గృహ నిర్బంధం

విజయవాడ డిసెంబర్ 26   (way2newstv.in)
ఏపీలో రాజకీయం రగిలిపోతుంది. సీఎం జగన్ మూడు రాజధానులు అంటూ సంచలన నిర్ణయం ప్రకటించడం తో అమరావతి ప్రాంత ప్రజలు ..ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని కృష్ణా - గుంటూరు జిల్లాల ప్రజా ప్రతినిధులకు అమరావతి పరిరక్షణ సమితి నేతలు వినతి పత్రాలు ఇస్తున్నారు. అలాగే  హైకోర్టు తరలింపు ప్రక్రియను వ్యతిరేకిస్తూ పశ్చిమ గోదావరి - కృష్ణా - గుంటూరు - ప్రకాశం - నెల్లూరు జిల్లాల యూనైటెడ్ అడ్వకేట్ యాక్షన్ కమిటీ తలపెట్టిన ధర్నాకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. 
ఏపీలో రాజకీయం వేడి.. ఎంపీ కేశినేని నాని గృహ నిర్బంధం

అయితే.. ప్రకాశం బ్యారేజీ వద్ద జరిగే ధర్నాకు అనుమతి లేదని పోలీసులు ఇప్పటికే స్పష్టం చేశారు. రైతులు - రాజకీయ నేతలతో కలిసి ప్రకాశం బ్యారేజీ వద్ద లాయర్లు తలపెట్టిన ధర్నాకు అనుమతి నిరాకరించినట్లు తేల్చి చెప్పారు. అక్కడ ధర్నాతో ప్రజల రాకపోకలకు ఆటంకం ఎదురవుతుందని అలాగే అది పురాతన కట్టడం కాబట్టి ప్రమాదం జరిగే అవకాశం ఉందని చెబుతూ అనుమతి నిరాకరించారు. సచివాలయానికి వెళ్లే మార్గాలు - చుట్టుపక్కల గ్రామాల్లో భారీగా పోలీసులు మోహరించారు. ముళ్లకంచెలు - బారికేడ్లను ఏర్పాటు చేశారు.ఇదిలా ఉండగా ముందస్తు చర్యల్లో భాగంగా విజయవాడ ఎంపీ కేశినేని నానిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు.

No comments:

Post a Comment