Breaking News

14/12/2019

సర్కార్ హాస్పటళ్లలో మందుల దందా

వరంగల్, డిసెంబర్ 14, (way2newstv.in)
ఉమ్మడి వరంగల్‍ జిల్లాలోని సర్కారు హస్పిటళ్లలో మందుల దందా నడుస్తోంది. జిల్లాలో మొత్తం 105 సెంటర్ల నుంచి ప్రభుత్వం వైద్య సేవలు అందిస్తోంది. ఫార్మసీ కంపెనీలు ఇచ్చే కమీషన్ల కోసం అధికారులు అవసరం లేని స్టాక్‍ తెప్పిస్తున్నారు. లక్షల రూపాయలు తమ జేబుల్లో వేసుకుని ప్రభుత్వ ఖజానాకు గండికొడుతున్నారు. ఉత్తర తెలంగాణలోనే పెద్ద దిక్కుగా ఉండే వరంగల్లోని ఒక్క ఎంజీఎం హాస్పిటల్లోనే  మూడేళ్లలో రూ.13.25 కోట్ల స్కాంకు పాల్పడ్డారు. ప్రధానంగా చిన్న పిల్లల ప్రొడక్ట్స్ కోసం ఓ ఫేమస్‍ కంపెనీ ప్రతినిధులతో చేతులు కలిపారు. అవసరం లేకున్నా అడ్వాన్సుగా సర్జికల్‍ స్టాక్‍ తీసుకొచ్చారు.జిల్లా పరిధిలో ఉండే పీహెచ్‍సీ, యూహెచ్‍సీగానీ తమ హాస్పిటల్‍ సెంటర్‍కు మందులు కావాలంటే.. 
సర్కార్ హాస్పటళ్లలో మందుల దందా

ఇక్కడి ఫార్మసిస్టు మొదట ఏ మందులు కావాలనే సమాచారాన్ని జిల్లాలోని సెంటర్‍ మెడిసిన్‍  స్టోర్‍ (సీఎంఎస్‍) అధికారులకు పంపించాలి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వచ్చిన ఇండెంట్‍ను ఇక్కడి ఆఫీసర్లు స్టాకుల వారీగా పరిశీలించాలి. కావాల్సిన దానికంటే ఎక్కువ పెడితే రిక్వెస్టును రిజెక్టు చేయవచ్చు. అలా కాకుండా అవసరమనుకుంటే హైదరాబాద్‍లోని టీఎస్‍ఎంఎస్‍ఐడీసీకి పంపించాలి. ఆపై వారు బడ్జెట్‍ ఆధారంగా వివిధ కంపెనీలకు స్టాక్‍ ఆర్డర్‍ ఇస్తారు. వచ్చిన మందులను జిల్లాల్లో ఉండే సీఎంఎస్‍కు పంపిస్తే వారు అక్కడినుంచి సంబంధిత ఆసుపత్రులకు సరఫరా చేయాలి. ఎంజీఎంతో పాటు ఉమ్మడి జిల్లా అంతటికీ డ్రగ్స్సరఫరా చేసే ఆఫీస్‍లో ఉండే అధికారులు.. హైదరాబాద్‍ స్థాయిలో చేతులు కలపడంవల్లే రూ. కోట్లలో స్టాక్‍ తెప్పించారనే ఆరోపణలు వినపడుతున్నాయి. హాస్పిటల్‍ స్థాయిలో ఉండే ఫార్మసిస్టుల యూజర్‍ ఐడీలు, పాస్వర్డులు తెప్పించుకుని ఇష్టారీతిన ఇండెంట్లు పెడుతున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో ఏదైనా జరిగితే స్టాక్‍ ఎవరి యూజర్‍ ఐడీ నుంచి వస్తే వారినే బాధ్యులను చేయవచ్చనే దురుద్దేశంతో పెద్దోళ్లు ఈ తతంగం నడిపిస్తున్నారు. ఇన్నాళ్లు ఈ బాధ్యతలు చూసిన ఓ ఇద్దరు ఆఫీసర్లు మరోచోటుకు బదిలీ అయ్యారు.  వీరి స్థానంలో వచ్చిన ఆఫీసర్లు గుర్తించడంతో విషయం ఉన్నతాధికారులకు చేరింది. హడావుడిగా ఒకరిద్దరు ఉద్యోగులపై బదిలీ వేటు వేసి విషయం బయటకు తెలియకుండా జాగ్రత్త పడ్డారు.ఎంజీఎంతో పాటు జిల్లాలోని సీఎంఎస్‍ ఆఫీసుల్లో బదిలీ  ఆఫీసర్ల స్థానాల్లో వచ్చినవారు ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు. అవసరం లేకున్నా వచ్చిన స్టాకులో ఒకే కంపెనీకి చెందిన  దాదాపు రూ.10 కోట్ల పైచిలుకు స్టాక్‍  స్టోర్‍ రూంలో మూలుగుతున్నట్లు తెలుస్తోంది. ఎంజీఎంలో గతంలో వివిధ సర్జికల్‍ విభాగాల్లో పనిచేసినవారు పదవీ విరమణ పొందడంతో ఇప్పుడు ఆపరేషన్లు నిర్వహించేవారు లేరు. ఎట్టి పరిస్థితుల్లోనూ స్టాక్‍ పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో ఎంజీఎం సూపరింటెండెంట్‍ స్టాక్‍ను వెనక్కు పంపే ప్రయత్నాలు చేస్తున్నారు. కంపెనీవారు వాటిని వెనక్కు తీసుకోవడం లేదు. కాగా సీఎంఎస్‍ సెంటర్లో  ఇప్పటికే రూ.6 కోట్ల మందులు  నిరుపయోగంగా ఉండడంతో ఇక్కడి అధికారులు ఎంజీఎం హాస్పిటల్‍ స్టాక్‍ తీసుకోడానికి నిరాకరిస్తున్నారు. ఇవే కాకుండా 104 వాహనాల్లో యూరిస్టిక్స్సేవల పేరుతో దాదాపు రూ.90 లక్షల స్టాక్‍ ఇలానే తెప్పించినట్లు సమాచారం. వరంగల్‍ అర్బన్‍ జిల్లా కమలాపూర్‍ పీహెచ్‍సీని కలెక్టర్‍ ప్రశాంత్‍ జీవన్‍ పాటిల్‍ గత నెలలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. తీసుకొచ్చిన మందుల స్టాక్‍.. అక్కడ ఉన్న దానికి తేడా గమనించారు. విచారణ చేపట్టాలంటూ ఆదేశాలు జారీ చేశారు. జిల్లావ్యాప్తంగా ఎలా ఉందో తనకు నివేదిక అందజేయాలన్నారు.ఎంజీఎం ఆసుపత్రిలో 2016–17 సంవత్సరానికిగాను సర్జికల్‍ ఐటమ్స్ కోసం రూ.4,35,48,660 విలువైన ఇండెంట్ పెట్టారు. టీఎస్‍ఎంఎస్‍ఐడీసీ రూ.4,35,51,394 విలువైన స్టాక్‍ పంపించింది. సర్జన్ లేని కారణంగా ఈ స్టాక్‍ వాడలేదు. అయినప్పటికీ 2017–18లో మళ్లీ రూ.4,67,48,660 సర్జికల్‍ మందులు కావాలని ప్రతిపాదనలు పంపగా రూ.4,67,68,541 స్టాక్‍ పంపించారు. వచ్చిన మందులతో  ఇక్కడి మెడిసిన్‍  స్టోర్‍ రూంలు నిండిపోయాయి. ఆపరేషన్లు చేసేందుకు డాక్టర్లు అందుబాటులో లేక మెడిసిన్‍  అలానే ఉండిపోయింది. 2018–19లో రూ.7,75,64,910 ఇండెంట్‍ టీఎస్‍ఎంఎస్‍ఐడీసీ దగ్గరకు వెళ్లింది. వారు రూ.4,22,60,209 సర్జికల్‍ మెడిసిన్‍ పంపించారు. ఇలా మూడేళ్లలో రూ.13,25,80,144 మందులు అనవసరంగా తెప్పించారు.

No comments:

Post a Comment