హైద్రాబాద్, డిసెంబర్ 14, (way2newstv.in)
ఆర్టీసీలో ‘ఎంప్లాయీస్ వెల్ఫేర్ బోర్డు’ ఏర్పాటు కోసం అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. బోర్డు ఎలా ఉండాలనే దానిపై ఇప్పటికే దాదాపు విధివిధానాలు పూర్తి చేశారు. మరో వారం రోజుల్లో అమలులోకి తెచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా ప్రతి డిపోలో ‘ఎంప్లాయీస్ బాక్స్’ ఏర్పాటు చేయనున్నారు. ఉద్యోగులు నిర్మొహమాటంగా తమ ఫిర్యాదులు, సమస్యలను లెటర్‌లో రాసి బాక్స్‌లో వేయాలి. లెటర్‌లో ఉద్యోగి తమ వివరాలు రాయాల్సి ఉంటుంది. బాక్స్‌లోని ఫిర్యాదులను అధికారులు రోజువారీగా బయటకు తీస్తారు. అయితే ఆ లెటర్ అధికారులకు చేరిందో లేదో తెలుసుకునేలా కూడా ప్రణాళిక రెడీ చేశారు. ఎవరైతే లెటర్స్ రాశారో వారి పేర్లను రోజువారీగా నోటీస్ బోర్డుపై పెడతారు. దీని ద్వారా సమస్య అధికారుల దృష్టికి వెళ్లినట్లు తెలుస్తుంది.
ఆర్టీసీలో వెల్ఫేర్ బోర్డుకు అంతా సిద్ధం
ఎంప్లాయీస్ బాక్స్ విధానం ఇప్పటికే సూర్యాపేట జిల్లాలో అమవుతోంది. కలెక్టర్ అమయ్‌కుమార్ ఈ పద్ధతి తీసుకొచ్చారు. దీన్ని ఉద్యోగులు మాత్రమే కాకుండా జిల్లాలోని ప్రజలందరూ ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం ఈ సిస్టమ్ సూర్యాపేట జిల్లాలో విజయవంతంగా అమలు చేస్తున్నట్లు తెలిసింది. ఇదే విధానాన్ని ఇప్పుడు ఆర్టీసీ తీసుకురానుంది.బాక్స్‌లో వేసిన లెటర్ను పరిశీలించి.. అందులోని సమస్యలను అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తారు. డిపో స్థాయి సమస్య అయితే డిపో పరిధిలో, రీజియన్ స్థాయిలో అయితే ఆర్‌ఎం పరిధిలో, ఆపై అయితే బస్‌భవన్‌లోని ఉన్నతాధికారులు పరిష్కరిస్తారు. డిపోల్లో వచ్చిన ప్రతి ఫిర్యాదును చెక్ చేసేందుకు బస్ భవన్‌లో ‘మానిటరింగ్ సెల్’ ఏర్పాటు చేయనున్నారు. డిపోల్లోని ఫిర్యాదులన్నీ ఈ సెల్లో ఫీడై ఉంటాయి. ఫిర్యాదులు పరిష్కరిస్తున్నారా? ప్రాసెస్ ఎంత వరకు వచ్చింది? ఒక వేళ పరిష్కరించకపోతే.. ఎందుకు పరిష్కరించడంలేదు? తదితర అంశాలను రోజువారీగా మానిటరింగ్ సెల్ చెక్ చేస్తుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ ఉన్నతాధికారిని నియమించనున్నారు. ఎంప్లాయీస్ బాక్స్ ద్వారా ఆర్టీసీలో పారదర్శకత పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు.ఇటీవల సీఎం కేసీఆర్ ప్రకంటించినట్లు డిపోకు ఇద్దరు సభ్యుల చొప్పున ఆర్టీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు కానుంది. 97 డిపోల నుంచి డిపోకు ఇద్దరు చొప్పున, మూడు వర్క్‌షాపుల నుంచి మరో ఇద్దరు చొప్పున మొత్తం 200 మందితో ఈ బోర్డు కొనసాగనుంది. సభ్యులను డిపో మేనేజర్లు సెలక్ట్ చేసి రీజియన్ మేనేజర్‌కు పంపిస్తారు. రీజనల్ మేనేజర్ ఫైనల్ చేస్తారు. ఇప్పటికే ఈ ప్రక్రియ మొత్తం పూర్తయినట్లు తెలిసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ సహా అన్ని కమ్యూనిటీలకు బోర్డులో చోటు కల్పించడంతోపాటు మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించేలా బోర్డును తీర్చిదిద్దుతున్నారు. బోర్డు ఏర్పడిన తర్వాత.. ఉద్యోగుల సమస్యలు, ఆర్టీసీ పరిస్థితిపై రోజూ డిపోలో ఇద్దరు సభ్యులతోపాటు డిపో అధికారులు రివ్యూ చేస్తారు. ప్రతి 15 రోజులకోసారి రీజియన్ మేనేజర్ స్థాయిలో, నెలకోసారి బస్‌భవన్ స్థాయిలో, రెండు నెలలకోసారి మంత్రి స్థాయిలో మీటింగ్ జరగనుంది.ఇప్పటివరకు ఆర్టీసీలో సమస్యల పరిష్కారానికి యూనియన్లు కీలకపాత్ర వహించాయి. ఇందు కోసం ప్రత్యేకంగా గుర్తింపు యూనియన్ ఎన్నికలు కూడా ఉండేవి. ఉద్యోగులు తమ సమస్యలను డిపో కార్యదర్శులకు చెప్పుకొనేవారు. కార్యదర్శులు తిరిగి జిల్లా కార్యదర్శులు, వారు తిరిగి రీజియన్ సెక్రటరీలకు తెలియజేసేవారు. అక్కడి నుంచి రాష్ట్ర స్థాయి నేతలకు వెళ్లేది. దీని వల్ల సమస్యలు పరిష్కారం కావడానికి నెల నుంచి రెండు నెలలు పట్టేదని అధికారులు చెబుతున్నారు. ఎంప్లాయీస్ వెల్ఫేర్ బోర్డు ద్వారా ఒకటి, రెండు రోజుల్లో సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉందని అంటున్నారు. గతంలో యూనియన్ నేతల మాదిరి బోర్డు సభ్యులకు ఎలాంటి లీవ్ రిలీఫ్‌లు ఉండవు. రోజువారీగా ఎవరి డ్యూటీని వారు చేసుకుంటూనే.. మీటింగ్లప్పుడు మాత్రం పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
No comments:
Post a Comment