అమరావతి డిసెంబర్ 10, (way2newstv.in)
టిడిపి వ్యూహకర్తల కమిటీతో చంద్రబాబు మంగళవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు,మాజీ మంత్రులు, పార్టీ బాధ్యులు పాల్గోన్నారు. చంద్రబాబు మాట్లాడుతూ తొలిరోజు శాసన సభ ఎలా జరిగిందో ప్రజలంతా చూశారు. సమస్యల పరిష్కారంపై సీఎం జగన్ కు శ్రద్ద లేదు. టిడిపిని అణిచేయడంపైనే వైసిపి దృష్టి పెట్టిందని అన్నారు. అసెంబ్లీలో, మీడియాలో, బయటా టిడిపి గొంతు నొక్కుతున్నారు. పేదల గొంతు వినిపించడమే టిడిపి చేసిన నేరమా..? పేదల కష్టాలపై సభలో నిలదీస్తే టిడిపిని అణిచేస్తారా..? ఉల్లి ధరలు తగ్గించమని డిమాండ్ చేయడం తప్పా..? ఎన్ కౌంటర్ చేస్తామని టిడిపి ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారని ఆరోపించారు. ప్రజలను వైసిపి నేతలు భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. తన చర్యలను ఎవరూ ప్రశ్నించరాదనేదే సీఎం జగన్ ఫాసిస్ట్ ధోరణి.
రైతు సమస్యలను ప్రస్తావించాలి
ఎవరేమనుకున్నా లెక్కపెట్టని పెడ మనస్తత్వం. తననెవరూ ప్రశ్నించరాదనేదే జగన్ అహంభావమని విమర్శించారు. మంగళవారం సభలో రైతుల సమస్యలు వినిపించాలి. ఉల్లి ధరలపై ప్రజల్లో వ్యతిరేకత నిన్న ప్రతిధ్వనింపచేశామని అన్నారు. ఉల్లి ధరలపై సభలో స్వల్పకాలిక చర్చ ఉంది. ప్రజల కష్టాలను, మహిళల అవస్థలను సభ దృష్టికి తేవాలి. ఉల్లి కోసం వెళ్తే ఉసురు తీయడం అమానుషం. గుడివాడ క్యూ లైన్ లో సాంబయ్య మృతి బాధాకరం. సాంబయ్య మృతితో అయినా వైసిపి నేతలు కళ్లు తెరవాలి. ఉల్లిపాయలు ఇంటింటికీ డోర్డెలివరీ చేయాలి.ఉల్లి డోర్ డెలివరీ చేయకపోతే వాలంటీర్లకు జీతాలు దండగని అయన అన్నారు. మొన్న విత్తనాల కోసం క్యూలైన్ లో ముగ్గురు రైతుల మృతి చెందారు. నిన్న ఉల్లి కోసం క్యూ లైన్ లో మరొకరి మృతి. క్యూ లైన్లలో జనం చనిపోతున్నా వైసిపి నేతల్లో స్పందన లేదని విమర్శించారు. గిట్టుబాటు ధరలు లేక రైతులు అల్లాడుతున్నారు. వరి, వేరుశనగ, పత్తి, పసుపు, శనగ రైతుల కష్టాలు సభలో ప్రస్తావించాలని అన్నారు. పామాయిల్ రైతులకు సరైన ధర వచ్చేలా ఒత్తిడి తేవాలి. గిట్టుబాటు ధరలేక రాష్ట్రంలో రైతులకు వేలకోట్ల నష్టం. మొక్కజొన్న ధర క్వింటాల్ కు రూ.600పడిపోయింది. వేరుశనగ ధర సగానికి పడిపోయింది. ధాన్యం రైతులను అనేక ఇబ్బందులు పెడుతున్నారు. పత్తిబోరాలతో, పెట్రోల్ సీసాలతో రైతుల ఆందోళనలు. రుణమాఫీ 4,5 కిస్తీలు రైతులకు వెంటనే చెల్లించాలి. వీటన్నింటినీ సభలో ప్రస్తావించాలి. రైతుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని సూచించారు.
No comments:
Post a Comment