Breaking News

10/12/2019

గత ప్రభుత్వం పౌర సరఫరాల సంస్థను నిర్వీర్యం చేసింది

అమరావతి డిసెంబర్ 10, (way2newstv.in)
అభివృద్ధి నిధులపై చంద్రబాబు హయాం నుంచే వివక్ష ఉందని.. 2016లో 40 మంది వైసీపీ సభ్యులు చంద్రబాబును కలిస్తే నిధులు ఇవ్వలేదని ఆర్థిక, శాసనసభ వ్యవహారాల మంత్రి  బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వం రాష్ట్ర పౌర సరఫరాల సంస్థను  నిర్వీర్యం చేసిందని అయన అన్నారు.  నాణ్యమైన బియ్యంపై గౌరవ ముఖ్యమంత్రి స్పష్టమైన ప్రకటన చేసినా, విపక్షం అర్ధం లేని విమర్శలు చేస్తోంది. ఇక టీడీపీ హయాంలో బియ్యం పంపిణీ కోసం 2018–19లో రూ.3 వేల కోట్లు కేటాయించి కేవలం రూ.200 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు.  కానీ ఈ ప్రభుత్వం ప్రజలు తినగలిగే విధంగా నాణ్యమైన బియ్యం సరఫరా కోసం రూ.4134 కోట్లు కేటాయించింది.  
గత ప్రభుత్వం పౌర సరఫరాల సంస్థను  నిర్వీర్యం చేసింది

గత 5 ఏళ్లలో పౌర సరఫరాల సంస్థను ఏ విధంగా నిర్వీర్యం చేశారన్నది చూస్తే.. ఇవాళ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థకు మొత్తం రూ.20 వేల కోట్ల అప్పులున్నాయని అయన అన్నారు.  రాష్ట్ర విభజన (2014–15) నాటికి ఆ సంస్థకు కేవలం రూ.6 వేల కోట్ల అప్పులు ఉండగా, 2017–18లో సంస్థ తరపున ప్రభుత్వం రూ.6500 కోట్ల అప్పు చేసింది. ఆ తర్వాత 2018–19లో ఒకేసారి రూ.7500 కోట్ల అప్పు చేసింది.  ఆ విధంగా గత ప్రభుత్వం 5 ఏళ్లలో రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ తరపున రూ.13,500 కోట్ల అప్పు చేసింది.  ఆ విధంగా తీసుకున్న అప్పును వేరే అవసరాల కోసం వాడారని అయన అన్నారు.  అంతే కాకుండా బియ్యం సరఫరా కోసం గత ఏడాది బడ్జెట్లో రూ.3 వేల కోట్లు కేటాయించి, కేవలం రూ.200 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు.  అయినా ఈ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. అసలు వారికి రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ, నాణ్యమైన బియ్యం గురించి మాట్లాడే హక్కు ఉందా అని ప్రశ్నించారు.  ఇవాళ ప్రభుత్వం రాష్ట్ర పౌర సరఫరాల సంస్థకు చెల్లించాల్సిన మొత్తం రూ.10,500 కోట్లు.   ఆ వివరాలు చూస్తే.. 2018–19 సబ్సిడీకి సంబంధించి రూ.3600 కోట్లు, అంతకు ముందు ఏడాదికి సంబంధించి రూ.400 కోట్లు.  ఇంకా అప్పుడు ప్రభుత్వం అట్టహాసంగా ప్రచారం చేసిన ‘చంద్రన్న సంక్రాంతి కానుక’, ‘రంజాన్ తోఫా’ లో సరఫరా చేసిన సరుకులకు సంబంధించి మరో రూ.1050 కోట్లు ప్రభుత్వం బకాయి పడింది.  ఆ విధంగా గత ప్రభుత్వం రాష్ట్ర పౌర సరఫరాల సంస్థను కుప్ప కూల్చింది.  అంతే కాకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు కూడా వాడారని మంత్రి బుగ్గన అన్నారు.  చివరి ఏడాది పౌర సరఫరాల సంస్థ పేరుతో చేసిన రూ.7500 కోట్లను ‘పసుపు కుంకుమ’ పథకం కోసం ఖర్చు చేశారని అన్నారు.

No comments:

Post a Comment