Breaking News

24/12/2019

మేడారంలో డబ్బులే..డబ్బులు

వరంగల్, డిసెంబర్ 24,(way2newstv.in)
మేడారంలో రోడ్డు వెంట ఉన్న జాగల కిరాయిలు ఆకాశన్నంటుతున్నయ్‌‌. సెకండ్‌‌ గ్రేడ్‌‌ సిటీల్లో.. మున్సిపాలిటీల్లో భూములు కొంటే ఇచ్చే రేట్‌‌ను మేడారంలో అద్దెకు తీసుకుంటున్నారు.  అడిగినంత ఇచ్చి ఇప్పటికే రోడ్డు వెంట ఉన్న భూముల్లో షాపులు పెట్టుకునేందుకు చాలా మంది అగ్రిమెంట్‌‌ చేసుకుంటున్నరు.మహాజాతరకు ఈ సారి కోటి మంది భక్తులు హాజరవుతారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ మేరకు అన్నీ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే రూ.75 కోట్లు విడుదల చేయగా అభివృద్ధి పనులు జోరుగా జరుగుతున్నాయి. మేడారంలోని దేవాలయం నుంచి నార్లాపూర్‌‌‌‌‌‌‌‌ వరకు సుమారు 5 కి.మీ. మేరకు ప్రధాన రహదారి ఉంటుంది. ఈ రోడ్డు వెంబడి సుమారు 2 వేల నుంచి 5 వేల షాపులు ఏర్పాటు చేసుకోవచ్చు. రోడ్డు వెంబడి పూర్తిగా వ్యవసాయ భూములే ఉన్నాయి.
మేడారంలో డబ్బులే..డబ్బులు

 రైతులు రెండో పంట వేసుకోకుండా ఈ జాగలను అద్దెకు ఇస్తుంటారు. రోడ్డు వెంబడి ఉన్న ఖాళీ స్థలాలకు అద్దె రేట్లు భారీగా ఉన్నాయి. మేడారం గద్దెల నుంచి జంపన్నవాగు వరకు గజం స్థలం రూ.10 వేల వరకు పలుకుతోంది. కొంచెం ముందుకు పోయే కొద్ది రూ. వెయ్యి, రెండు వేలు తగ్గుతూ పోతున్నాయి. ఊరట్టం, రెడ్డిగూడెం, చిలుకల గుట్ట, కన్నేపల్లి వైపు గజానికి డబ్బులు తగ్గించి ఇస్తున్నారు. రూ.4 వేల నుంచి రూ.8 వేల వరకు ధరలు పలుకుతున్నాయి మేడారంలో రోడ్డు వెంట ఉన్న భూముల అద్దె ధరలు ఆకాశన్నంటుతున్నాయి. ద్వితీయ స్థాయి నగరాలు.. మున్సిపాలిటీలలో భూములు కొంటే ఇచ్చే ధరను మేడారంలో కేవలం అద్దెకివ్వడానికే యజమానులు చెబుతున్నారు. అయినా భూ యజమానులు అడిగినంత ఇచ్చి ఇప్పటికే రోడ్డు వెంట ఉన్న  భూములలో షాపుల ఏర్పాటుకోసం చాలా మంది ఒప్పందాలు చేసుకుంటున్నారు.  వచ్చే ఏడాది ఫిబ్రవరి 5 నుంచి 8వ తేదీ వరకు జరిగే మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరను పురస్కరించుకొని రోడ్ల వెంట షాపులు పెట్టడానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వ్యాపారులు ఆసక్తి చూపుతున్నారు. 20 నుంచి నెల రోజుల పాటు షాపులు పెట్టుకోవడానికి ప్రభుత్వ అనుమతులు తీసుకుంటున్నారు. దీంతో ఖాళీ జాగల ధరలు అమాంతం పెరిగాయి.మేడారంలో రోడ్డు వెంట షాపులు పెట్టుకోవడానికి ఆసక్తి చూపించే వారికి భూ యజమానులు ఖాళీ జాగలను గజాల చొప్పున కొలిచి ఇస్తున్నారు. రోడ్డు వెంబడి జాగ కొలిచి లోపలికి ఎంతైనా ఉపయోగించుకునేలా ఈ ఒప్పందాలు జరుగుతున్నాయి. ఉదాహరణకు రోడ్డు వెంబడి 10 గజాల స్థలం కొలిచి ఇస్తే షాపు యజమాని ఆ 10 గజాల వెడల్పు మాత్రమే ఉపయోగించుకుంటూ పొడవు ఎంత దూరమైనా షాపు ఏర్పాటు చేసుకోవచ్చు. పొడవు, వెడల్పు కలిపి వంద గజాల స్థలం ఉపయోగించుకున్నా.. చెల్లించేది మాత్రం 10 గజాలకు రూ.లక్ష చొప్పున మాత్రమే. ఖాళీ జాగలలో షాపులు ఏర్పాటు చేసుకోవడానికి ఒప్పందాలు చేసుకున్న వ్యాపారులు మేడారంలో దుకాణాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. అడవిలో లభ్యమయ్యే కలపను తీసుకొచ్చి తాత్కాలికంగా షెడ్లు వేస్తున్నారు. ఇప్పటికే ప్రధాన రహదారికి ఇరువైపులా కొత్తగా చాలా దుకాణాలు వెలిశాయి.

No comments:

Post a Comment