Breaking News

18/12/2019

రక్షణ రంగానికి హబ్‌గా హైదరాబాద్: మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్ డిసెంబర్ 18 (way2newstv.in)
భౌగోళికంగా ఉన్న పరిస్థితులకుతోడు తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక విధానాలు ప్రపంచ పెట్టుబడులను అకర్షిస్తున్నాయని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు.. హైదరాబాద్‌లో నెలకొన్న సానుకూల వాతావరణం వల్ల దేశ విదేశాల్లోని బడా కంపెనీలు ఇక్కడ పరిశ్రమల స్థాపనకు ముందుకు వస్తున్నాయి. హోటల్‌ తాజ్‌కృష్ణలో యూఎస్‌ కాన్సులేట్‌ జనరల్‌ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు యూఎస్‌-ఇండియా డిఫెన్స్‌ ఒప్పందాలపై సదస్సుకు మంత్రి కేటీఆర్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.రక్షణరంగానికి చెందిన మల్టినేషనల్, ఇండియన్ ప్రీమియర్ రీసెర్చ్ సెంటర్స్ హైదరాబాద్ పరిరసర ప్రాంతాల్లో ఉన్నాయి. జీఈ, బోయింగ్, లాక్ హీడ్ మార్టిన్, సికోర్క్సీలు ఇప్పటికే రాగా, మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు క్యూ కడుతున్నాయి. 
నిందితుల‌కే హ‌క్కులు ఉంటాయా?, మాకు హ‌క్కులు ఉండ‌వా?

రక్షణ రంగానికి అవసరమయ్యే లీప్ ఇంజన్లు, ఎఫ్ 16 యుద్ధ విమానాల రెక్కలు, అపాచీ హెలికాప్టర్ల విడిభాగాలు, అదానీ ఎల్బిట డిఫెన్స్ సిస్టమ్స్ ద్వారా డ్రోన్ల తయారీ, సూపర్ హెర్క్యూలస్ ఎయిర్ లిఫ్టర్ (సీ-130జె), హెలికాప్టర్ (ఎస్-92)ల ఉత్పత్తి విజయవంతంగా జరుగుతున్నది. ఈ బడా కంపెనీలకు సంబంధించి పరికరాలు తయారుచేసేందుకు పెద్ద మొత్తంలో ఎంఎస్‌ఎంఈలు నెలకొంటున్నాయి. హైదరాబాద్ మిైస్సెల్ టెక్నాలజీలో మేజర్ హబ్‌గా కొనసాగుతున్నది.'దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం తెలంగాణ. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో రాష్ట్రం నెంబర్‌వన్‌గా ఉంది. టీఎస్‌ఐపాస్‌ ద్వారా కంపెనీలకు 15 రోజుల్లోనే అనుమతులు ఇస్తున్నామని' తెలిపారు. 'టీఎస్‌ఐపాస్‌ ద్వారా ఐదేళ్లలో అనేక పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. అమెజాన్‌ వంటి పెద్ద సంస్థలు హైదరాబాద్‌కు వచ్చాయి. తెలంగాణ డిఫెన్స్‌ హబ్‌గా మారుతుంది. 12కు పైగా డిఫెన్స్‌ సంస్థలు హైదరాబాద్‌లో ఉన్నాయి. 25 ఏరోస్పేస్‌ సంస్థలు హైదరాబాద్‌లో పనిచేస్తున్నాయి. బోయింగ్‌ లాంటి సంస్థలు నగరంలో ఉన్నాయి. ఆదిబట్లలో ప్రత్యేకంగా ఏరోస్పేస్‌ పార్క్‌ ఏర్పాటు చేశాం. తెలంగాణ ఆకాడమీ ఆఫ్‌ స్కిల్స్‌ ద్వారా ప్రత్యేక శిక్షణలు ఇస్తున్నాం. వరల్డ్‌ క్లాస్‌ డిఫెన్స్‌ యూనివర్సిటీ హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తాం. టీహబ్‌ భారత్‌లోనే అతిపెద్ద స్టార్టప్‌ హబ్‌. హార్డ్‌వేర్‌ స్టార్టప్‌కు ప్రోత్సాహం అందిస్తున్నామని' మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు.

No comments:

Post a Comment