కడప డిసెంబర్ 03 (way2newstv.in)
కడప జిల్లా రైల్వే కోడూరు స్టేషన్ వద్ద తిరుపతి షిరిడీ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఇంజిన్ వెనక ఉన్న జనరల్ బోగీ పట్టాలు తప్పడంతో అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే రైలును నిలిపివేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. స్టేషన్ కు దగ్గరగా వుండడంతో రైలు నెమ్మదిగానే పోతోంది.
పట్టాలు తప్పిన షిర్దీ ఎక్స్ ప్రెస్…ప్రయాణికులు క్షేమం
ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది సంఘటన స్థలికి వెళ్లి మరమ్మతు చర్యలు చేపట్టారు. ఘటన నేపధ్యంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
No comments:
Post a Comment