Breaking News

03/12/2019

అధికారులకు సీఎం జగన్ ఆదేశం

అమరావతి డిసెంబర్ 03  (way2newstv.in)
కళ్లకు క్యాన్సర్ సోకిన చిన్నారి హేమ ఆనారోగ్యం మీద వార్తాపత్రికల్లో వచ్చిన కథనంపై సీఎం  వైయస్.జగన్ స్పందించారు.తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక గ్రామానికి చెందిన చిన్నారి హేమకు అనారోగ్యంపై సీఎం ఆరా తీసారు.ఇలాంటి నిరుపేదలను పూర్తిస్థాయిలో ఆదుకోవడానికి ఆరోగ్యశ్రీలో భారీ సంస్కరణలకు ఇంతకముందే నిర్ణయం తీసుకున్నామని అయన అన్నారు.
అధికారులకు సీఎం జగన్ ఆదేశం

క్యాన్సర్ రోగులకు ఆరోగ్యశ్రీ కింద ఎన్ని విడతలు చికిత్స అవసరమైనా చేయించండని అయన ఆదేశించారు.చికిత్సలో ఎన్ని సైకిల్స్ అవసరమైనా పూర్తి ట్రీట్మెంట్ అందిస్తున్నాం. గతంలో మాదిరిగా కాకుండా ఆరోగ్యశ్రీ కింద క్యాన్సర్ రోగులకు ఏ పరిమితి లేకుండా చికిత్స వుంటుందని అయన అన్నారు. జనవరి 1 నుంచి ఇది అమల్లోకి వస్తోంది. ఈలోగా అత్యవసర కేసులు ఉంటే.. ఆ రోగులకు వెంటనే చికిత్సలు అందించండని  అధికారులకు సీఎం ఆదేశించారు. చిన్నారి హేమ కుటుంబంతో మాట్లాడి, వైద్యం కోసం అసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు

No comments:

Post a Comment