Breaking News

02/12/2019

ఊరించి...మళ్లీ తగ్గిన ఆటో విక్రయాలు

ముంబై, డిసెంబర్ 2 (way2newstv.in)
వాహన అమ్మకాలు మళ్లీ తిరోగమన బాటపట్టాయి. పండుగ సీజన్‌లో ఒకేఒక నెలలో ఆశించిన స్థాయిలో నమోదైన విక్రయాలు ఆ మరుసటి నెలలో భారీగా పడిపోయాయి. కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ అమ్మకాలు ఏడాది ప్రాతిపదికన 1.9 శాతం తగ్గి 1,50,630 యూనిట్లకు జారుకున్నాయి. క్రితం ఏడాది ఇదే నెలలో సంస్థ 1,53,539ల విక్రయాలు జరిపింది. వీటిలో దేశవ్యాప్తంగా 1,43,686 ల అమ్మకాలు జరుపగా, మిగతావి విదేశాలకు ఎగుమతి చేసింది. మినీ కార్ల విభాగానికి చెందిన ఆల్టో, వ్యాగన్ ఆర్ అమ్మకాలు 12.2 శాతం పడిపోయి 26,306లకు పరిమితమవగా, కాంప్యాక్ట్ సెగ్మెంట్‌కు చెందిన స్విఫ్ట్, సెలేరియో, ఇగ్నిస్, బాలెనో, డిజైర్ విక్రయాల్లో వృద్ధి 7.6 శాతంగా ఉండగా, మధ్యస్థాయి సెడాన్ సియాజ్ సేల్స్ 3,838ల యూనిట్ల నుంచి 1,448లకు పడిపోయాయి. 
ఊరించి...మళ్లీ తగ్గిన ఆటో విక్రయాలు

యుటిలిటీ వాహన విక్రయాలకు బ్రేక్ పడింది. మరో సంస్థ మహీంద్రా సేల్స్ కూడా ఏడాది ప్రాతిపదికన 9 శాతం క్షీణించి 41,235లకు పడిపోయాయి. గతేడాది ఇదే నెల 45,101ల విక్రయాలు జరిపినట్లు సంస్థ తెలిపింది. వీటిలో దేశీయం గా 38,614లను విక్రయించిన సంస్థ.. 2,621 లను ఇతర దేశాలకు ఎగుమతి చేసింది.పండుగ సీజన్ తర్వాత తొలి నెలలో ఆటోమొబైల్ రంగం ఎంతో నేర్చుకున్నదని, వినియోగదారుల డిమాండ్ అంతంత మాత్రం గానే ఉన్నదని, ముఖ్యంగా ప్యాసింజర్ వాహన విభాగం మందకొడిగా ఉన్నదని మహీంద్రా చీఫ్ సేల్స్, మార్కెటింగ్ విజయ్ రామ్ నక్రా తెలిపారు. దేశవ్యాప్తంగా గత నెలలో 20,414 వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించిన సంస్థ..వీటిలో 618లను ఇతర దేశాలకు ఎగుమతి చేసింది. అలాగే 21,032 ల ట్రాక్టర్లను విక్రయించింది. కాగా, టాటా మోటర్స్ 41,124ల వాహనాలను మాత్రమే అమ్మిం ది. క్రితం ఏడాది ఇదే నెలలో విక్రయించిన 55,074లతో పోలిస్తే 25.32 శాతం పడిపోయాయి. నవంబర్ నెలలో హోండా కార్స్ అమ్మకాలు 50 శాతం తగ్గి 6,459లకు జారుకున్నాయి. అంచనావేసిన స్థాయి కంటే మెరుగైన స్థితిలోనే వాహనాలను విక్రయించినట్లు హెచ్‌సీఐఎల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాజేశ్ గోయెల్ తెలిపారు. అలాగే గత నెలలో 3,239 యూనిట్ల హెక్టార్ వాహనాన్ని విక్రయించినట్లు ఎంజీ మోటర్ ప్రకటించింది.

No comments:

Post a Comment