Breaking News

26/12/2019

తెలంగాణ ఎన్నికలకు టీ కాంగ్రెస్ సిద్ధం

హైద్రాబాద్, డిసెంబర్ 26, (way2newstv.in)
తెలంగాణలో మరో సవాల్‌ను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్‌ నేతలు సిద్దమౌతున్నారు. వరుస ఓటములతో ఢీలాపడ్డ టీకాంగ్రెస్‌... మున్సిపల్‌ ఎన్నికలకు వ్యూహారనచన చేస్తుంది. మున్సిపాలిటీల్లో గెలిచి తమ ఉనికిని చాటుకునేందుకు టీపీసీసీ కసరత్తు ప్రారంభించింది.తెలంగాణలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో పాగవేసేందుకు టీకాంగ్రెస్‌ సన్నదమౌతుంది. వచ్చే యేడాది జనవరిలో 120 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనుండటంతో... ఈ ఎన్నికల్లో గెలిచేందుకు టీకాంగ్రెస్‌ ప్రణాళికలు సిద్దం చేసుకుంటుంది. ఇందులో భాగంగా గాంధీభవన్‌లో టీపీసీసీ మున్సిపల్ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. 
తెలంగాణ ఎన్నికలకు టీ కాంగ్రెస్ సిద్ధం

సమావేశంలో టీపీసీసీ చీప్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు పొన్నం ప్రభాకర్, సంపత్ కుమార్, కోదండరెడ్డి తదిరులు పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లీ టీఆర్‌ఎస్‌ పార్టీని ఇరకాటంలో పెట్టాలని పార్టీ నేతలకు ఉత్తమ్‌ సూచించారు. మరోవైపు ఎన్నికల కమిషన్‌ తీరుపై కాంగ్రెస్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీకి ఈసీ అనుకూలంగా వ్యవహరిస్తొందని ఉత్తమ్‌ ఆరోపింపచారు. రిజర్వేషన్లు ఖరారు చేయకుండా నోటిఫికేషన్‌ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఎన్నికల అధికారి నాగిరెడ్డి టీఆర్‌ఎస్‌ కార్యకర్తలాగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. ఎన్నికల షెడ్యూల్‌పై హైకోర్టును ఆశ్రయిస్తామన్నారు టీకాంగ్రెస్‌ నేతలు.రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో వార్డుల విభజన సక్రమంగా జరగలేదని కాంగ్రెస్‌ నేతలు ఆరోపించారు. అధికార పార్టీకి అనుకూలంగా వార్డుల విభజన జరిగిందన్నారు. ఇక మున్సిపల్‌ ఎన్నికల కోసం అభ్యర్థల ఎన్నిక స్థానిక నాయకత్వానిదేనని... అభ్యర్థుల ఎంపికలో సామాజిక న్యాయం ఉంటుందని టీకాంగ్రెస్‌ నేతలు స్పష్టం చేశారు. పార్టీలో అంతర్గత విబేదాలు, వలసలతో టీ కాంగ్రెస్‌ ఇప్పటికే తీవ్రంగా నష్టపోయింది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలోనూ పూర్తిగా విఫలమైంది. వరుస ఓటములతో కాంగ్రెస్‌ నేతలు తీవ్ర నిరాశలో  ఉన్నారు. ఇలాంటి తరుణంలో సీఎం కేసీఆర్‌ను ఎదుర్కొని మున్సిపాలిటీల్లో అత్యధిక స్థానాలను గెలుచుకోవడమంటే అంతా సులువుకాదని పలువురు అంటున్నారు.

No comments:

Post a Comment