Breaking News

31/12/2019

ఏజెన్సీ ప్రాంతంలో స్కూల్స్ సమయంలో మార్పు

అదిలాబాద్, డిసెంబర్ 31 (way2newstv.in)
రాష్ట్రంలో రెండ్రోజుల పాటు పొడి వాతావరణం ఏర్పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో సోమ, మంగళవారం చలి గాలులు వీస్తాయని వెల్లడించింది. ఆదివారం ఆదిలాబాద్ జిల్లా భీంపూర్‌‌‌‌‌‌‌‌ మండలంలో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత 5 డిగ్రీలుగా నమోదైంది. సంగారెడ్డి , ఆసిఫాబాద్‌‌‌‌, తదితర జిల్లాల్లో చలి ఎక్కువగాఉన్నట్టు తెలిపింది.ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో టెంపరేచర్లు బాగా పడిపోయాయి. పట్టణాల్లో ఏడు డిగ్రీల కన్నా పెరగడంలేదు. అటవీ ప్రాంతాలకు దగ్గరగా ఉండే గ్రామాల్లో టెంపరేచర్ 2, 3 డిగ్రీలకంటే తక్కువకు పడిపోతోంది. 
ఏజెన్సీ ప్రాంతంలో స్కూల్స్ సమయంలో మార్పు

మరో ఐదు రోజులపాటు ఇదే పరిస్థితి ఉంటుందని ఇండియన్ మెట్రొలాజికల్ డిపార్ట్మెంట్ అధికారులు హెచ్చరించడంతో ఆయా జిల్లాల కలెక్టర్లు అప్రమత్తమయ్యారు. స్కూళ్ల టైమింగ్ మార్చే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ఆదివారం అర్లి.టి 5,తాంసి 6.2, సిర్పూర్ యు 6.6, బరంపూర్ 7, ఆదిలాబాద్ కలెక్టరేట్ 7 .3, తలమడుగులో టెంపరేచర్ 7.9 డిగ్రీలు నమోదైనట్లు తెలిపింది. రాత్రుళ్లు చలి తీవ్రంగా ఉంటోందని, ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కోళ్లు, మేకలు చనిపోతున్నాయని ఫారాల రైతులు చెబుతున్నారు.ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలతో పాటు మారుమూల పల్లెల్లో పగటి ఉష్ణోగ్రతలు ఆమాంతం పడిపోయి చలి విజృంభిస్తుండడంతో సామాన్య జనజీవనం అల్లాడిపోతోంది. ఆదివారం భీంపూర్ మండలంలో 3.0 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదుకాగా ఆదిలాబాద్‌లో 4.4 డిగ్రీల సెల్సియస్ రికార్డయింది. రెండు మూడు రోజులుగా అతి శీతల గాలులు జిల్లా ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తుండడంతో ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు పాక్షికంగా పనిచేస్తున్నాయి. ఉత్తరాది నుండి వీస్తున్న చలి గాలుల ప్రభావంగానే ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో రికార్డుస్థాయిలోకనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, మరో పది రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. ఉదయం 5 గంటల నుంచే ఆదిలాబాద్ పట్టణంతో పాటు పరిసరాల్లో మంచు దుప్పటి కమ్మేయడంతో వాహనదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రాత్రి వేళల్లో విపరీతమైన మంచు కురుస్తుండడంతో పట్టణాలు, పల్లెలు మరో కశ్మీరాన్ని తలపిస్తున్నాయి. ప్రభుత్వ వసతి గృహాల్లో అరకొర సౌకర్యాలతో నిద్రిస్తున్న విద్యార్థుల పరిస్థితి కడుదయనీయంగా మారింది. సుమారు 70కిపైగా వసతి గృహాల్లో సోలార్ విద్యుత్ పనిచేయకపోవడంతో చిన్నారులు చన్నీటి స్నానాలు ఆచరిస్తూ అస్వస్థతకు గురవుతున్నారు. ఉట్నూరు, ఆసిఫాబాద్, బోథ్, ఇంద్రవెల్లి ప్రాంతాల్లో విద్యార్థులు, వృద్దులు, మహిళలు శ్వాసకోశ సంబంధ వ్యాధులతో ఆసుపత్రుల పాలవుతున్నారు. చర్మవ్యాధులు కూడా చలి పంజాకు వెంటాడుతుండడంతో ప్రజలు పాలుపోని పరిస్థితిని ఎదుర్కోవల్సి వస్తోంది. ఆదివారం అత్యల్పంగా అర్లిటిలో 3.0డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదుకాగా ఆదిసోమవారం సైతం భీంపూర్ మండలంలో 3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదుకాగా ఆదిలాబాద్‌లో 4.4 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. మంచిర్యాల జిల్లాలో 5.3 డిగ్రీలు, నిర్మల్‌లో 5.6 డిగ్రీలు నమోదు కావడం గమనార్హం.ఎప్పుడు లేని విధంగా ఆదిలాబాద్ జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పని వేళలను కుదించడం జరిగిందని ఆదిలాబాద్ కలెక్టర్  తెలిపారు. జనవరి 9వ తేదీ వరకు పాఠశాలల పనివేళల్లో మార్పులు కొనసాగుతాయని, విద్యాశాఖ ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు సమయపాలన పాటించాలని సూచించారు

No comments:

Post a Comment