Breaking News

11/12/2019

బద్దలైన అగ్ని పర్వతం...

న్యూఢిల్లీ, డిసెంబర్ 11  (way2newstv.in)
న్యూజిలాండ్‌లోని వైట్ ఐలాండ్‌లోని అగ్నిపర్వతం ఒక్కసారి పేలిపోయింది. ఆ సమయంలో అక్కడ సుమారు 50 మంది పర్యాటకులు ఉన్నారు. వారిలో ఐదుగురు చరిపోగా.. మరికొందరు గల్లంతయ్యారు. రెస్క్యూ సిబ్బంది ఇప్పటివరకు 23 మందిని రక్షించారు. అగ్నిపర్వతంలో చిక్కుకున్న పర్యాటకులను రక్షించేందుకు న్యూజిలాండ్ సైన్యం, పోలీసులు కలిసి శ్రమిస్తున్నారు. వాకారీ లేదా వైట్ ఐలాండ్‌గా పిలిచే ఈ అగ్నిపర్వతం చిన్న దీవిపై ఉంది. ఆ దేశంలో అత్యంత క్రియాశీలకంగా ఉండే అగ్నిపర్వతాల్లో ఇదీ ఒకటి. 
బద్దలైన అగ్ని పర్వతం...

అగ్నిపర్వతం బద్దలైన సమయంలో.. దానిపై ఉన్న పర్యాటకులు ఎగిరిపడ్డారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వారంతా సురక్షితంగా ఉన్నారా? లేదా బిలంలో పడి చనిపోయారా అనేది ఇంకా తెలియరాలేదు.ఈ పర్వతం పేలుతుండగా బోటులో ప్రయాణిస్తున్న పర్యాటకులు తమ కెమేరాలతో ఈ ఘటనను చిత్రీకరించారు. అగ్నిపర్వతం బద్దలైన వెంటనే దట్టమైన పొగ పరిసరాలను కప్పేయడం ఈ వీడియోలో చూడవచ్చు. అలాగే, అగ్నిపర్వతంపై ఉన్న హెలిప్యాడ్‌లో ఓ హెలికాప్టర్ సైతం ధ్వంసమై ఉంది. పర్యాటకులు తీసిన ఈ వీడియోలను చూస్తే.. అగ్నిపర్వతం ఏ స్థాయిలో బద్దలైందో అర్థమవుతుంది.

No comments:

Post a Comment