నిర్మల్,డిసెంబర్ 31 (way2newstv.in)
పదవి విరమణ అయిన ఏఎస్ఐ జనార్ధన్ గౌడ్ కు జిల్లా పోలీస్ కార్యాలయంలో అత్మయ వీడ్కోల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ .సి.శశిధర్ రాజు, జనార్ధన్ గౌడ్ కు పూలమాల వేసి శాలువలతో సన్మానించారు. పోలీస్ ఉద్యోగ నిర్వహణలో అంకిత భావంతో పనిచేసి అందరి మన్ననలను పొందినారని శుభాకాంక్షలు తెలియజేస్తు రిటైర్డ్ మెంట్ బెనిఫిట్ పత్రాలు అందచేశారు.ఈ సంర్బంగా ఎస్పీ మాట్లాడుతూ కానిస్టేబుల్ గా పోలీసు శాఖలో చేరి గత 30 సంవత్సరాల కాలం పోలీసు శాఖలో అమూల్యమైన సేవలు అందించి, తన సేవలకు గుర్తుగా ప్రభుత్వం నుండి, పోలీసు శాఖ నుండి అవార్డులు, రివార్డులు అందుకొని (ఎ.ఎస్.ఐ) గా ఈరోజు పదవి విరమణ చేయడం జరిగింది.
పదవి విరమణ పొందుతున్న పోలీ’సులకు అత్మీయ వీడ్కోలు
నిర్మల్ జిల్లాలలో సుధీర్ఘకాంగా విధులు నిర్వహించి పదవీ విరమణ చేసిన సేవను మరువమని, పదవీ విరమణ చేసిన మీరు పోలీస్ కుటుంబంలో ఎలాంటి సమస్య వచ్చిన తనను సంప్రదించ వచ్చని. పదవీ విరమణ ప్రతి ఒక ఉద్యోగి కి తప్పదని, ఉద్యోగంలో ఉన్నపుడు చేసిన సేవలే ఉద్యోగణాంతరం కూడా వ్యక్తి గుర్తుండేలా మంచి పేరు ప్రఖ్యాతలు తెస్తాయని, “ పోలీసు రిటైర్ మెంట్ కేవలం తన వృత్తికే, కాని తన వ్యక్తిత్వానికి కాదు” అని కొనియాడారు. విధి నిర్వహణలో పగలనక, రాత్రనక, పండగల సమయంలో భార్యా,పిల్లలకు దూరంగా ఉండి డ్యూటీలు చేసినారు. పదవి విరమణ చేసిన మీరు ఇకపై కుటుంబ సభ్యులతో అనందంగా వారి భావి జీవితం ఆయురారోగ్యాలతోసుఖసంతోషాలతో గడపాలని ఆకాంక్షినారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు శ్రీనివాస్ రావు, వెంకట్ రెడ్డి, నిర్మల్ డిఎస్పీ ఉపేందర్ రెడ్డి, ఎస్బి ఇన్స్పెక్టర్ వెంకటేష్, పోలీస్ అసోసియేషన్ వీరసత్ అలీ, ప్రకాష్, మురాద్ అలీ, గంగాధర్ మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment