Breaking News

28/11/2019

చదువు గొప్పతనాన్ని చాటిచెప్పిన ఘనత పూలేదే: జగదీష్‌ రెడ్డి

సూర్యాపేట నవంబర్ 28 (way2newstv.in)
సమాజంలోని అట్టడుగు వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మహనీయుడు మహాత్మా జ్యోతిబాపూలే అని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌ రెడ్డి అన్నారు. పూలే 129వ వర్థంతి నేడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సూర్యాపేటలో పూలే విగ్రహానికి మంత్రి పూలమాల వేసి నివాళులర్పించారు. 
చదువు గొప్పతనాన్ని చాటిచెప్పిన ఘనత పూలేదే: జగదీష్‌ రెడ్డి

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పూలే సేవలను కొనియాడారు. చదువు గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన ఘనత పూలేదేనన్నారు. పూలే స్ఫూర్తితో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషిచేస్తుందన్నారు. పూలే ఆశయాలను కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్‌ నిమ్మల శ్రీనివాస్‌ గౌడ్‌, జడ్పీటీసీ జీడీ బిక్షం, గండూరి కృపాకర్‌, బీసీ సంఘాల నేతలు, తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment