Breaking News

28/11/2019

సూపర్ స్టార్ కృష్ణ మేనల్లుడు వివాహ రిసెప్షన్

సూపర్ స్టార్ కృష్ణ ద్వితీయ సోదరి శ్రీమతి ఉప్పలపాటి లక్ష్మి తులసి , ప్రముఖ నిర్మాత పద్మావతి పిక్చర్స్ ఉప్పలపాటి సూర్య నారాయణ బాబుల కుమారుడు వినాయక శివ సాయి బాబు వివాహ రిసెప్షన్ హైదరాబాద్ లో ని గండిపేట గోల్కొండ రిసార్ట్స్ లో  సినీ రాజకీయ ప్రముఖుల సమక్షం లో అతి వైభవంగా జరిగింది . సూపర్ స్టార్ కృష్ణ, మేనల్లుడు వినాయక శివ సాయి బాబు,  వధువు కొల్లి పద్మావతి వెంకటేశ్వర్ రావు దంపతుల కుమార్తె సాయి ఆశ్రిత ల ను ఆశీర్వదించారు . 
సూపర్ స్టార్ కృష్ణ మేనల్లుడు వివాహ రిసెప్షన్

ఈ వేడుకల్లో ప్రముఖ నిర్మాత, పద్మాలయ స్టూడియోస్ అధినేత ఘట్టమనేని ఆది శేషగిరి రావు , శ్రీమతి ప్రమీళ దంపతుల తో పాటు , ఘట్టమనేని రత్నాకర్ బాబు దంపతులు ,ఘట్టమనేని పద్మావతి -అరవింద్ బాబు దంపతులు ,, సూపర్ స్టార్ కృష్ణ కుమార్తె, నిర్మాత గల్లా పద్మావతి -జయదేవ్, మంజుల -సంజయ్  , పోసాని ప్రియదర్శిని-నాగ సుధీర్ బాబు , పోసాని రాణి -నాగేశ్వర్రావు దంపతులు , ఘట్టమనేని నమ్రత-మహేష్ , ప్రముఖ నిర్మాత నందిగం రామలింగేశ్వర రావు , కే.యస్.రామారావు , బి.వి.యస్. ప్రసాద్ , కే. దామోదర్ ప్రసాద్, శాఖమూరి మల్లికార్జున రావు , లక్ష్మి ఫిలిమ్స్ బోస్ ,    యమ్.యల్.సి బుద్ధా వెంకన్న , గద్దె రామ్ మోహన్ రావు,   పరుచూరి మురళి , సూపర్ స్టార్ కృష్ణ మహేష్ సేన రాష్ట్ర అధ్యక్షులు దిడ్డి రాంబాబు , ప్రధాన కార్యదర్శి పి . మల్లేష్ , బాలాజీ శర్మ , సి. కృష్ణ కన్నారావు , నాగేశ్వర్ రావు తదితరులు శుభాకాంక్షలు తెలియజేసారు .

No comments:

Post a Comment