న్యూ ఢిల్లీ నవంబర్ 28 (way2newstv.in)
వివాదాస్పద బీజేపీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ థాకూర్‌ను ఉగ్రవాదిగా పోలుస్తూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఇవాళ ఓ ట్వీట్ చేశారు. ఉగ్రవాది ప్రజ్ఞా థాకూర్ మరో ఉగ్రవాది గాడ్సేను దేశభక్తుడంటూ కామెంట్ చేశారని రాహుల్ తన ట్వీట్‌లో విమర్శించారు. భారత పార్లమెంట్ చరిత్రలో ఇది అత్యంత దుర్దినం అన్నారు. బుధవారం లోక్‌సభలో మాట్లాడుతూ గాడ్సే దేశభక్తుడంటూ ఎంపీ ప్రజ్ఞా వ్యాఖ్యానించారు.
ప్రజ్ఞా సింగ్ వ్యాఖ్యలపై లోక్‌సభలోదుమారం..కాంగ్రెస్ ఎంపీల వాకౌట్
దీనిపై ఇవాళ సభలో దుమారం లేచింది. ఈ అంశంపై చర్చ చేపట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. కానీ స్పీకర్ ఓం బిర్లా చర్చకు అనుమతించలేదు. దీంతో కాంగ్రెస్ ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేశారు. కాంగ్రెస్ పార్టీని ఉగ్రవాదంతో ఎలా పోల్చారని అధిర్ రంజన్ చౌదరీ అంతకముందు ప్‌్శ్నించారు. వేలాది మంది నేతలను ఇచ్చిన పార్టీని ఇలా అంటారా, అసలు ఏం జరుగుతోంది, సభలో అందరూ మౌనంగా ఉంటారా అని ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సభలో మాట్లాడుతూ ప్రజ్ఞా వ్యాఖ్యలను ఖండించారు. మహాత్మా గాంధీ బోధనలు తమకు ఎంతో స్పూర్తినిచ్చాయన్నారు. రాజకీయవేత్తలు గాంధీని ఆదర్శంగా తీసుకుంటారన్నారు.
No comments:
Post a Comment