Breaking News

08/11/2019

అర్థరాత్రి ఇసుకను తవ్వేస్తున్నారు...

నల్గొండ, నవంబర్ 8, (way2newstv.in)
నల్గొండలో ఇసుక దందా
క్రమార్జనకు పాల్పడుతున్న తీరుకు అర్ధరాత్రి ఇసుక అక్రమ రవాణా నిదర్శనంగా నిలుస్తోంది. జిల్లాలోని వాగులు, వంకల నుంచి యథేచ్ఛగా, నిబంధనలకు విరుద్ధంగా అక్రమార్కులు ఇసుక రవాణా కొనసాగిస్తున్నారు. తనిఖీల పేరుతో ఇసుక ట్రాక్టర్లను పట్టుకునే ప్రయత్నం చేస్తున్న కొందరు కిందిస్థాయి పోలీస్ అధికారులు, ఉద్యోగులు అవకాశం మేరకు నాలుగు కాసులు వెనుకేసుకోవడమే లక్ష్యంగా అర్ధరాత్రి విధులను కొనసాగిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.  మండలంలోని  రామచంద్రపురం, ఎండ్లపల్లి, టేకుమట్ల తదితర ప్రాంతాల్లో ఇసుక డంపులు గుర్తించి రెవెన్యూ అధికారులకు అప్పగించారు.జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న మూసీ నది ఇసుకను టేకుమట్ల, భీమవరం ప్రాంతాలను అడ్డాగా చేసుకుని అక్రమార్కులు స్వేచ్ఛగా అర్ధరాత్రి రవాణాను కొనసాగిస్తున్నారు. 
అర్థరాత్రి ఇసుకను తవ్వేస్తున్నారు...

మండలంలోని తాళ్ళ ఖమ్మం పహాడ్ సమీపంలో ఉన్న మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్ వెనుకవైపు రహస్య స్థావరాలను ఏర్పాటు చేసుకుని వ్యాపారం కొనసాగిస్తున్నారు. కోదాడ నియోజకవర్గ పరిధిలోని మోతె మండలంలో పాలేరు వాగు మొదలుకొని హుజూర్‌నగర్ నియోజకవర్గంలోని కృష్ణానది పరివాహక ప్రాంతాలైన నేరేడుచర్ల, చింతలపాలెం, మేళ్ళచెరువు మండలంలోని పులిచింతల సమీపం, చింత్రీయాల సమీప గ్రామాల్లో యథేచ్ఛగా అక్రమ రవాణా కొనసాగుతోంది.మూసీ పరివాహక ప్రాంతాన్ని అనుకుని ఉన్న తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని ఏటి ఒడ్డు ప్రాంతాలైన జాజిరెడ్డిగూడెం, నాగారం మండలాల్లో ఉన్న వర్థమానుకోట, పేరాబోయినగూడెం, ఈటూర్, మాచిరెడ్డిపల్లె గ్రామాల్లో జోరుగా ఇసుక రవాణా కొనసాగుతోంది. గతంలో మద్దిరాల మండలం జి.కొత్తపల్లి, ముకుందపురం గ్రామాల రైతులు ఇసుక రవాణాకు పాల్పడుతున్న జేసీబీలను పోలీసులకు పట్టించి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా అక్రమార్కుల వ్యవహార శైలిలో ఇప్పటి వరకు ఎటువంటి మార్పు కనిపించకపోవడం వెనుక మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అనుచరుల హస్తమేనని, గతంలో వచ్చిన విమర్శలు నిజమేనని ప్రజలు భావిస్తున్నారు.ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేసినా జిల్లాలోని ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ అవి క్షేత్రస్థాయిలో అమలు కావడంలేదనేది తేటతెల్లమౌతోంది. ఇందుకు కారణం సంబంధిత అధికారులు అక్రమార్కుల వద్ద నుండి అమ్యామ్యాలు పుచ్చుకుంటున్న సంఘటనలు పలు ప్రాంతాల్లో సర్వసాధరణం అయ్యాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.నిజమైన గృహ నిర్మాణాదారులకు ఇంతకు ముందు ప్రభుత్వం ప్రతి శుక్రవారం ఇస్తున్న అనుమతి, అవకాశాన్ని కొందరు దుర్వినియోగం చేస్తున్నారని విమర్శలు సైతం లేకపోలేదు. పగలు, రాత్రి తేడా లేకుండా మూసీ, బిక్కేరు, పాలేరు వాగుల నుంచి ఇసుక అక్రమ దందాలు సాగుతున్న తీరుపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు పర్యావరణాన్ని పరిరక్షించాలని, భూగర్భ జలాల పెంపునకు కృషి చేయాలని పాలకులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థల నిర్వహకులు గొంతెత్తి నినదించినా.. అక్రమాలకు సహకరిస్తున్న అధికా రులు, ఉద్యోగులు ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు

No comments:

Post a Comment