Breaking News

07/11/2019

దోమలపై యుద్ధానికి గ్రేటర్ కసరత్తు

చలి కావడంతో అధికారుల్లో హైరానా
హైద్రాబాద్, నవంబర్ 6, (way2newstv.in)
ఈ ఏడాది జులైలో ప్రారంభమైన జ్వరాలు ఇప్పటికీ తగ్గుముఖం పట్టకపోవడంతో నియంత్రణ చర్యలపై అధికార యంత్రాంగం మరింత దృష్టి సారించారు. వరుస వర్షాలతో ప్రతీ ఇంట్లో ఒకరు జ్వరం బారిన పడ్డారు. డెంగీ, మలేరియా, చికున్‌గున్యా జ్వరాలు రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా కొనసాగుతున్నాయి. ఇప్పటికీ ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు డెంగీ, చికున్‌గున్యా వంటి జ్వరాలు రద్దీగా ఉన్నాయి. దోమల వల్లే డెంగీ, మలేరియా జ్వరాలు వ్యాప్తి చెందుతున్నాయి. డెంగీకి దారితీసే దోమ శుభ్రమైన మంచినీటిలో పెరుగుతుంది. ఈ దోమలను నివారించడాని కి ఇంట్లో పరిశుభ్రత, నీటిని నిల్వ ఉంచుకోకుండా చూడడం ముఖ్యం. అలాగే చుట్టుపక్కల నీరు నిల్వ ఉంటే అక్కడ కూడా డెంగీకి కారణమయ్యే దోమ పుడుతుంది. ఇటువంటి దోమను నిర్మూలించాలంటే నిరంతరం మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు ఫాగింగ్ చేయాలి. 
దోమలపై యుద్ధానికి గ్రేటర్ కసరత్తు

కానీ ఈ ఏడాది ఫాగింగ్ యంత్రా లు పూర్తిస్థాయిలో లేకపోవడంతో దోమల నివారణ జరగలేదు. దీంతో దోమలు స్వైర్య విహారం చేస్తున్నాయి. వాటి నివారణకు వైద్య ఆరోగ్య శాఖ, పారిశుద్య సంస్థలు సంయుక్తంగా, మరింత సమర్ధంగా పనిచేయాలని నిర్ణయించాయి.తలనొప్పి, ఒళ్లునొప్పులు, వాంతులు, వీరేచనాలు వంటి లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరుతున్నారు. వాస్తవంగా సెప్టెంబర్ చివరి నాటికే వర్షాల తీవ్రత తగ్గిపోవాలి. కానీ అక్టోబర్ నెలాఖరు దాకా కూడా నిరంతరం వర్షాలతోనే రాష్ట్రం తడిసి ముద్దయిందఇప్పటికీ సాయంత్రం అయిందంటే చాలు రాష్ట్రంలో ఏదోకచోట మేఘాలు ఆవరించి ఒక్కసారిగా కుండపోత వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. నవంబర్‌లోనూ కొన్నిరోజులు కొనసాగే పరిస్థితి ఉండటంతో దోమలు మరింత విజృంభించే ప్రమాదం పొంచివుంది. రాష్ట్రంలో అధికారిక లెక్కల ప్రకారం ఇద్దరు మాత్రమే మృతి చెందినట్లు ఆరోగ్య శాఖ చెపుతున్నా అనధికారిక సమాచారం ప్రకారం డెంగీతో కనీసం 150 మందికిపైగా చనియినట్టు తెలుస్తుంది. అందులో ఒక్క నీలోఫర్‌లో ఆసుపత్రిలోనే ఏడుగురు పసి పిల్లలు డెంగీతో చనిపోయారని అక్కడి వైద్యులే అనధికారికంగా చెపుతున్నారు. డెంగీ జ్వరాల్లో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో ఉందని ఏకంగా కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ ప్రకటించింది.క్రమంగా చలి కూడా పుంజుకొంటుండటంతో అదికారుల్లో హైరానా మొదలైంది. ఒకవైపు డెంగీ, చికున్‌గున్యా వానాకాలం సీజన్‌లో వచ్చేవి, శీతాకాలంలో స్వైన్‌ఫ్లూ పుంజుకుంటుంది. వర్షాల వల్ల వాతావరణం చల్లగా ఉండటంతో ఒకవైపు డెంగీ, మరోవైపు స్వైన్‌ఫ్లూ ఇప్పుడు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. వానాకాలం, చలికాలంలో వేర్వేరుగా వచ్చే ఈ రెండు వ్యాధులు ఇప్పుడు ఒకేసారి రాష్ట్రంలో విజృంభిస్తున్నాయి. అంటే ప్రజలపై ఈ రెండూ ఒకేసారి దాడి చేస్తున్నాయన్నమాట. ఈ ఏడాది జనవరి నుంచి గత నెల 30వ తేదీ వరకు తెలంగాణలో 1500 మందికి స్వైన్‌ఫ్లూ కేసులు నమోదు కాగా, 21 మంది చనిపోయారుదీంతో జ్వరం, తలనొప్పి వస్తేనే ప్రజలు భయపడిపోతున్నారు. డయాగ్నస్టిక్ సెంటర్లకు పరుగులు తీస్తున్నారు. మామూలు జ్వరానికి కూడా అన్ని పరీక్షల కోసం వేల రూపాయలు వెచ్చిస్తున్నారు. ఇదే అదునుగా డయాగ్నాస్టిక్ సెంటర్లు, వైద్యులు దీనినో వ్యాపారంగా మార్చేస్తున్నారు. దానికితోడు వైరల్ జ్వరాలతో బాధపడుతున్న రోగులు వ్యాదినిరోధక మందులు విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. అది ఇతరత్రా ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుందని వైద్యులు చెపుతున్నారు.ఫాగింగ్ యంత్రాలు కొనుగోలు చేశారు. దోమలపై దండయాత్ర చేయటానికి ఏకంగా 1000 ఫాగింగ్ యంత్రాలను కొనుగోలు చేశారు. ఎక్కడా దోమలు లేకుండా చేయాలని, పకడ్బంధీగా వ్యవహరించాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో రోగాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ఆరోగ్యశాఖ రోడ్‌మ్యాప్ సిద్ధం చేసింది. హెల్త్, పంచాయతీరాజ్, మున్సిపాలిటీ అధికారులు సంయుక్తంగా ఈ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని ఆదేశాలు జారీచేశారు.

No comments:

Post a Comment