Breaking News

12/11/2019

శాఖాహారం తగ్గుతోంది... డిమాండ్ ఉన్నా...సప్లయిలో తేడా

నిజామాబాద్, నవంబర్ 12, (way2newstv.in)
రోగ్యానికి రోజూ కావాల్సిన పోషక విలువల మేరకు కూరగాయలను ప్రజలు తినడం లేదని రాష్ట్ర ఉద్యానశాఖ స్పష్టం చేసింది. అలాగే రాష్ట్ర ప్రజలకు అవసరమైనన్ని కూరగాయలు మన రాష్ట్రంలో పండటం లేదు. రాష్ట్ర ప్రజల ఆహారపు అలవాట్లు, కూరగాయలు, పండ్ల వినియోగం, పంటల సాగు, దిగుబడులు, కొరత తదితరాలపై ఉద్యాన శాఖ సమగ్ర అధ్యయనం చేసి నివేదికను రూపొందించింది. దీని ప్రకారం రాష్ట్ర ప్రజలు నిత్యం 20 రకాల కూరగాయలను వినియోగిస్తున్నారు. ప్రతి ఒక్కరూ నిత్యం ఆహారంలో తప్పనిసరిగా 300 గ్రాముల కూరగాయలు తింటేనే సమగ్ర పోషక విలువలు అందుతాయి. ఈ 300 గ్రాముల్లో అన్ని రకాల కూరగాయలు ఉండాలి. ప్రజలు ఆకుకూరలు బాగా తక్కువ తింటున్నందున విటమిన్లు, ఇతర పోషకాల లోపాలతో అనారోగ్యం పాలవుతున్నారు. 
శాఖాహారం తగ్గుతోంది... డిమాండ్  ఉన్నా...సప్లయిలో తేడా

కంటిచూపు తగ్గడం వంటి సమస్యలు ఎక్కువగా పెరగడానికి ఆకుకూరలు ఆహారంలో తక్కువగా ఉండటమే ప్రధాన కారణమని ఉద్యానశాఖ స్పష్టం చేసింది.సగటున ఒకరు ఆకు కూరలు రోజుకు 50 గ్రాములు తినాలి. అయితే 26 గ్రాములే తింటున్నారు. దుంపరకాలు 50 గ్రాములకు గాను 32 గ్రాములు, ఇతర రకాలు 200 గ్రాములకు 175 గ్రాములు రాష్ట్ర ప్రజలు తింటున్నారు. ఉల్లిగడ్డలు మాత్రం 25 గ్రాములకు గాను రోజుకు 36 గ్రాములు తింటున్నట్లు ఉద్యాన శాఖ పేర్కొంది. మొత్తంగా రోజుకు 300 గ్రాములు అన్ని రకాల కూరగాయలు తినాల్సి ఉండగా 233 గ్రాములే తింటున్నారు. 67 గ్రాముల లోటు ఉంది.రాష్ట్రంలో అత్యధికంగా టమాటాలు పండుతున్నా ప్రజలకు అన్ని కాలాల్లో అందుబాటులో లేక ధరలు మండుతున్నాయి. మొత్తం 90,714 ఎకరాల్లో 9.52 లక్షల టన్నులు పండుతున్నాయి. రాష్ట్ర ప్రజల అవసరాలకు 5.37 లక్షల టన్నులు చాలు. కానీ ఏడాది పొడవునా 12 నెలల్లో వరసగా పంట రావడం లేదు. సెప్టెంబరు నుంచి ఏప్రిల్ దాకా ధర లేక రైతులు నష్టపోతుంటే ఆ తరువాతి నెలల్లో ధరల మంటతో ప్రజల జేబులు ఖాళీ అవుతున్నాయి.మే నెలలో అధిక ఎండలకు ఈ పంట ఎక్కువగా దెబ్బతిని దిగుబడి పడిపోతోంది. 3 వేల ఎకరాల రైతులను గుర్తించి ఫిబ్రవరి నుంచి ప్రతి నెలకు వెయ్యి ఎకరాల చొప్పున సాగు ప్రారంభిస్తే వేసవిలో టమాటాల కొరత రాదు. హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల్లో టమాటా, వంగ, బెండ వంటి తోటల సాగు పెంపునకు ఎకరానికి రూ.15,320 చొప్పున రాయితీలివ్వాలి. జీడిమెట్లలోని సెంటర్ ఎక్సలెన్స్ నుంచి ఎకరాకు సరిపోయే నారు రూ.7,200 రాయితీతో రైతులకివ్వాలి.రైతుల ఆదాయాన్ని పెంచడానికి హైదరాబాద్ నగరం అతి పెద్ద మార్కెట్‌గా అందుబాటులో ఉంది. ఏడాది మొత్తానికి అవసరమయ్యే 7.22 లక్షల టన్నుల కూరగాయల సరఫరాకు 41,840 ఎకరాల్లో పంటలు పండించాలి. అందుకు రంగారెడ్డి, మహబూబ్‌నగర్, యాదాద్రి, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో కాలనీలు ఏర్పాటు చేయాలి. ఏడాది పొడవునా ప్రతి కూరగాయ పంట సాగయ్యేలా చూడాలన్నదే ఉద్యాన శాఖ ప్రధాన లక్ష్యంగా ఉంది. అలాగే ఆకు కూరలు 10,300 ఎకరాల్లో సాగు చేయాలని పేర్కొంది.బెండ 6 వేల ఎకరాల్లో, కాకరకాయ 1900 ఎకరాలు ఉండాలి. పచ్చి మిరప 4600 ఎకరాల్లో, ఆలుగడ్డ 3800 ఎకరాల్లో, క్యాబేజి 550 ఎకరాలు,చిక్కుడు 5200 ఎకరాల్లో సాగు చేయాలి. హైదరాబాద్ నగరంలో భవనాలపై వర్టికల్ ఫార్మింగ్ విధానంలో గొట్టాలకు రంధ్రాలు చేసి పలు రకాల కూరగాయలు పండించవచ్చు. దీనివల్ల ప్రతి ఇంటికీ తాజా కూరగాయలు లభిస్తాయి. ప్రస్తుతం రాష్ట్రంలో పండిస్తున్న కూరగాయలు సరిపోకపోవడంతో కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్ దిల్లీ, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవలసి వస్తోంది

No comments:

Post a Comment