Breaking News

04/11/2019

ఆర్టీసీకార్మికుల బిక్షాటన

గద్వాల నవంబర్ 04  (way2newstv.in)
ఆర్టీసీ కార్మికుల నిరవధిక సమ్మెలో భాగంగా ఆర్టీసి కార్మికుల సమ్మె సోమవారంతో 31వ రోజుకు చేరుకుంది. గద్వాల ఆర్టీసి జేఏసి ఆధ్వర్యంలో కార్మికులు బిక్షాటన కార్యక్రమం చేపట్టారు. ర్యాలీగా వెళ్లి పాదాచారులను వాహనదారులను, వ్యాపారస్తులను బిక్షం అడిగారు. అనంతరం గద్వాల ఆర్టీసి డిపో ముందు బైఠాయించి ప్రతిజ్ఞ చేశారు.
ఆర్టీసీకార్మికుల బిక్షాటన

ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేసేంతవరకు, ఆర్టీసి కార్మికుల సమస్యల పరిష్కరించేంతవరకు ఆర్టీసి కార్మికులు ఎవరూ విధులోకి చేరమని అందరూ ప్రతిజ్ఞ చేశారు. తెలంగాణ మజ్దూర్ యూనియన్ డిపో ప్రెసిడెంట్  విజయ భాస్కర్ రెడ్డి, ఎంప్లాయిస్ యూనియన్ డిపో వర్కింగ్ ప్రెసిడెంట్ పరమేశ్వర య్య,డ్రైవర్లు, కండక్టర్లు  పాల్గొన్నారు.

No comments:

Post a Comment