Breaking News

30/11/2019

మరింత కఠిన చట్టాలు

హైదరాబాద్ నవంబర్ 30 (way2newstv.in)
ప్రియాంక రెడ్డి హత్య  మానవ సమాజం సిగ్గుపడే సంఘటనగా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్రెడ్డి వ్యాఖ్యానించారు. శనివారం బాధితురాలి కుటుంబ సభ్యులను కిషన్రెడ్డి పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. డాక్టర్ హత్య బాధాకరమన్నారు. ఈ కేసు అత్యంత వేగంగా విచారణ జరిపి నేరస్థులకు ఉరి శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.   బ్రిటీష్ కాలం నాటి చట్టాలకు సానె పెట్టబోతున్నాం. త్వరలోనే చట్టాలను మార్చబోతున్నాం.  
మరింత కఠిన చట్టాలు

క్రిమినల్ కేసుల్లో ట్రయల్ కోర్టు తీర్పు తరువాత   సుప్రీంకోర్టు దే తుది నిర్ణయం ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. మహిళల రక్షణ కోసం 112 ప్రత్యేక ఆప్ రూపొందించాం. దీనిని దేశం లోని ప్రతి మహిళ డౌన్ లోడ్ చేసుకోవాలి.  ఎల్లుండి ఇదే విషయం పై లోక్ సభ లో చర్చ జరుగుతుందని అన్నారు.  ఫోక్సో చట్టం వల్ల నిందితులకు సత్వరమే శిక్షలు పడుతున్నాయి. ) ప్రియాంక రెడ్డి విషయంలో పోలీసులు సరిహద్దుల విషయం లో తాత్సారం చేయడం బాధాకరమని అన్నారు. ) భవిష్యత్తు లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చట్టాలను మార్చబోతున్నాం .  ఢిల్లీ నిర్భయ ఘటన తరువాత అంతటి ఘోరమైన హేయమైన ఘటన శంషాబాద్ లో చోటుచేసుకుంది. ) నిందితులకు త్వరగా శిక్షలు పడేందుకు రాష్ట్ర పోలీసులకు సహకారం అందిస్తాం.  112 ఆప్ ను తెలంగాణ లోని అన్ని జిల్లాలకు విస్తరించే విషయమై డీజీపీ తో మాట్లాడాను.  గుజరాత్ లో రాత్రి వేళ లో సైతం  మహిళలు ఒంటరిగా తిరుగుతారు. ఆ పరిస్థితి దేశ వ్యాప్తంగా రావాలని అన్నారు.

No comments:

Post a Comment