Breaking News

02/11/2019

మల్యాల లో ఆర్టీసీ కార్మికుల ఆందోళన

అస్వస్థతకు గురైన డ్రైవర్
జగిత్యాల నవంబర్ 02,(way2newstv.in):
మల్యాల మండల కేంద్రంలో కరీంనగర్ ఎంపీ బండి సంజాయ్ కుమార్ పట్ల పోలీసుల అనుచిత వైఖరిని నిరసిస్తూ ఇక్కడి బీజేపీ నేతలు శనివారం నాడు ఆందోళన కార్యక్రమంను నిర్వహించారు.ఈ ధర్నాలో జగిత్యాల డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ పాల్గొనగా తీవ్ర అస్వస్థతకు గురి అయ్యారు.దీనితో అతన్ని వెంటనే చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల పట్ల అనుసరిస్తున్న వైఖరిపై ఆగ్రహించిన ఆర్టీసీ కార్మికులు జగిత్యాల స్థానిక పాత బస్టాండ్ వద్ద గల రహదారిపై  ఆందోళన నిర్వహించారు.
మల్యాల లో  ఆర్టీసీ కార్మికుల  ఆందోళన

ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులు ప్రాణాలు పోగొట్టుకున్న కేసీఆర్ కు చలనం లేకుండా  ప్రగతిభవన్, ఫామ్ హౌస్ కు పరిమితం అయ్యారని ఆరోపించారు. శ్రీనివాస్ కు ఏ హాని జరిగిన తెలంగాణ ప్రభుత్వం,సీఎం కేసీఆర్ నైతిక బాధ్యత వహించాలన్నారు. ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన ఆర్టీసీ కార్మికుల మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే అని,దీనికి సీఎం కేసీఆర్ నైతిక బాధ్యత వహించాలన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్టీసీ జేఏసీ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పరామర్శ.మల్యాల మండల కేంద్రంలో శనివారం బిజెపి,ఆర్టీసీ కార్మికులు నిర్వహించిన ధర్నాలో అస్వస్థతకు గురైన డ్రైవర్ శ్రీనివాస్ జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సా పొందుతుండగా, శ్రీనివాస్ ను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పరపర్శించారు.ఈ సందర్భంగా కార్మికులు ఎవరు ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని,పోయిన ప్రాణం తిరిగిరాదన్నారు.కార్మికుల ఉద్యమానికి తెలంగాణలోని ప్రతి పౌరుడి మద్దతు ఉందన్నారు.మృతి చెందిన ఆర్టీసీ కార్మికులను రూ. 50 లక్షల రూపాయల ప్రభుత్వం మృత ధనం, ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ వెంట జగిత్యాల ఆర్టీసీ డిపో కార్మిక సంఘం నాయకులు బండ శంకర్ ఉన్నారు.

No comments:

Post a Comment