Breaking News

01/11/2019

తెలంగాణలో 10వేలు దాటిన డెంగీ కేసులు

హైద్రాబాద్, నవంబర్ 1  (way2newstv.in)
వర్షాకాలం ముగిసినా, వానలు మాత్రం ఆగుతలేవు. ప్రతి రోజూ కురుస్తూనే ఉన్నాయి. ఇటు రోగాలు కూడా తగ్గుతలేవు. జనాలు వైరల్ ఫీవర్లు, దగ్గు, జలుబు, దమ్ము బారిన పడుతున్నారు. ఇప్పటికే రాష్ర్టంలో డెంగీ కేసుల సంఖ్య 10 వేలు దాటింది. నేటికీ రోజూ పదుల సంఖ్యలో డెంగీ కేసులు నమోదవుతున్నాయి. దీంతో పేషెంట్లతో దవాఖానలుకిటకిటలాడుతున్నాయి.రాష్ర్టంలో మధ్యాహ్నం ఎండ, సాయంత్రం వాన, రాత్రి నుంచి పొద్దున వరకూ చలి వాతావరణం ఉంటోంది. ఒకే రోజు వ్యవధిలో ఇన్ని మార్పులతో పిల్లలు, వృద్ధులకు ఇబ్బందిగా మారింది. దీంతో డెంగీ పూర్తిగా తగ్గకముందే స్వైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లూ కేసులు పెరుగుతున్నాయి. సెప్టెంబర్ చివరి నాటికి 1,306 కేసులు ఉండగా.. ఇప్పుడీ సంఖ్య 1,325 దాటింది. చలి పెరుగుతున్నకొద్దీ వైరస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు మరింత విస్తరించే ప్రమాదం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. 
తెలంగాణలో 10వేలు దాటిన డెంగీ కేసులు

స్వైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫ్లూ సోకకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచిస్తున్నారు.ఆరోగ్య శాఖ ఇప్పటివరకూ స్వైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫ్లూపై ఎలాంటి అవగాహన కార్యక్రమాలు చేపట్టలేదు. వర్షాకాలంలో విష జ్వరాలు విజృంభిస్తాయని తెలిసినా ఆరోగ్య, ఇతర శాఖలు అప్రమత్తంగా లేవు. దీంతో లక్షల మంది విష జ్వరాల బారినపడి దవాఖాన్ల పాలయ్యారు. డెంగీ కేసులు పెరిగిన తర్వాతగానీ ప్రభుత్వం మేలుకుని, ప్రజలకు అవగాహన కల్పించలేదు. ఇప్పుడు స్వైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లూ విషయంలో కూడా ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. దవాఖాన్లకు మందులు సరఫరా చేసిన ప్రభుత్వం, వైరస్ విస్తరించకుండా ప్రజలకు అవగాహన కల్పించడాన్ని మరిచిందని జిల్లాల హెల్త్ ఆఫీసర్లు అంటున్నారు.మ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాకో డిస్ర్టిక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెన్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీడియా ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(డెమో) ఉండేవారు. డెమోల కింద హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎడ్యుకేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెన్షన్ ఆఫీసర్లు, డిప్యూటీ డెమో ఆఫీసర్లు, పీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీల సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు ఉంటారు.  వీళ్లందరినీ కోఆర్డినేట్ చేస్తూ డెమోలు అవగాహన కార్యక్రమాలు జరపాలి. కానీ ప్రస్తుతం కేవలం 2 జిల్లాలకు మాత్రమే డెమో ఆఫీసర్లు ఉన్నారు. కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిన టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం, డెమో పోస్టులు క్రియేట్ చేయలేదు. ఉమ్మడి జిల్లాలకు ఒక్కోటి చొప్పున పది డెమో పోస్టులు ఉంటే, 8 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. రోగాలు రాకుండా ప్రచారం చేసేందుకు పాంప్లెట్లు, అవగాహన కార్యక్రమాలు రూపొందించాల్సింది డెమో ఆఫీసర్లే. వాళ్లే లేకపోవడంతో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా అవగాహన కార్యక్రమాలు రూపొందించడానికి అవకాశం లేకుండా పోయిందని ఆఫీసర్లు చెబుతున్నారు. అవేర్నెస్ప్రోగ్రామ్స్ కోసం ఉమ్మడి రాష్ర్టంలో ప్రతి డెమోకు కొంత బడ్జెట్ కేటాయించేవారు. ప్రస్తుతం వారికి నిధులు ఇవ్వడంలేదు. కేవలం ప్రభుత్వం  ఇచ్చిన పాంప్లెట్ల పంపిణీకే వీళ్లు పరిమితమవుతున్నారు.

No comments:

Post a Comment