Breaking News

01/11/2019

విపక్షాలను ఒక్కటి చేస్తున్న ఇసుక

విశాఖపట్టణం, నవంబర్ 1 (way2newstv.in)
ప్రతిపక్షాలన్నీ ఒక్కటవుతాయా? జగన్ ను టార్గెట్ చేసేందుకు చేతులు కలుపుతాయా? ఆంధ్రప్రదేశ్ లో ఐదు నెలల్లోనే విపక్షాల ఐక్యత ఎంతమాత్రం అనేది బయటపడనుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ఐదు నెలలకే హీటెక్కాయి. ఎన్నికలు ఇప్పట్లో లేకపోయినా అన్ని పార్టీలూ జనంలోనే ఉండేందుకు ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా టీడీపీ, జనసేన పార్టీలు క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్టం చేసుకునేందుకు కార్యాచరణను సిద్ధం చేసుకున్నాయి.ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు పూర్తయి ఐదు నెలలు కూడా పూర్తికాలేదు. అప్పుడే విపక్షాలు రోడ్డెక్కుతున్నాయి. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఇప్పటికే వివిధ అంశాలపై పోరాట బాట పట్టింది. ఇసుక కొరతపై మండల స్థాయిలో ధర్నాలు నిర్వహించింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అయితే ఏకంగా గుంటూరులో ఒక దీక్షకు దిగారు. 
విపక్షాలను ఒక్కటి చేస్తున్న ఇసుక

భారతీయ జనతా పార్టీ కూడా ఇసుక కొరతపై రాష్ట్ర వ్యాప్తంగా బిక్షాటన కార్యక్రమాన్ని చేపట్టిందిఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా విపక్షాలన్నీ విడివిడిగానే పోరాటం చేశాయి. జనసేన ఇప్పటి వరకూ ఎలాంటి ఆందోళన నిర్వహించకున్నా విశాఖపట్నంలో ఇసుక కొరతకు వ్యతిరేకంగా లాంగ్ మార్చ్ ను పవన్ కల్యాణ్ చేపట్టారు. ఇందుకోసం ఆయన అందరి సహకారం తీసుకుంటున్నారు. చంద్రబాబు, కన్నా లక్ష్మీనారాయణలకు ఫోన్ చేసి మద్దతు ఇవ్వాలని పవన్ కల్యాణ్ కోరారు.అయితే ఈ కార్యక్రమంలో అందరూ ఏకం అవుతారా? లేదా? అన్నది చర్చగా మారింది. చంద్రబాబు పవన్ కల్యాణ్ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మద్దతిచ్చారంటున్నారు. చంద్రబాబు స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటారా? లేక తమ పార్టీ నేతలను పంపుతారా? అన్నది తేలాల్సి ఉంది. ఇక బీజేపీ కూడా పవన్ పిలుపునకు సానుకూలంగానే స్పందించింది. పార్టీ అధ్యక్షులు పవన్ చేసే పోరాటానికి మద్దతుగా పాల్గొనకపోయినా నేతలు, క్యాడర్ పాల్గొనే అవకాశాలున్నాయి. మొత్తం మీద ప్రభుత్వం ఏర్పడిన ఐదు నెలలకు విపక్షాలన్నీ ఐక్య పోరాటాలకు ఆంధ్రప్రదేశ్ లో సిద్ధమయ్యాయి.

No comments:

Post a Comment