Breaking News

01/10/2019

కూతురుకు కీలక పదవి....

నిజామాబాద్, అక్టోబరు 1, (way2newstv.in)
ఓడిన సీనియర్లందర్నీ ఆయన సెటిల్‌ చేస్తున్నారు. మంత్రి పదవులు రాని ఎమ్మెల్యేలను సైతం నామినేటెడ్‌ పోస్టులతో హ్యాపీ చేస్తున్నారు. రానున్న రోజుల్లో కవితకు కీలక పోస్ట్ ఇవ్వబోతున్నారన్న చర్చ ఊపందుకుంటోంది. కూతురు రాజకీయ భవిష్యత్తుపై సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు...?నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత రాజకీయ భవిష్యత్తుపై ఇంకా సందిగ్దత కొనసాగుతోంది. లోక్ సభ ఎన్నికల్లో ఓటమి అనంతరం సీఎం కేసీఆర్ తనయ కవిత, పెద్దగా బయటకు కనిపించడం మానేశారట. ఊహించని ఓటమితో నిరాశలో ఉన్న ఆమె, పార్టీ వ్యవహారాలను అంతగా పట్టించుకోవడం లేదనే టాక్ వినిపిస్తోంది. జిల్లాకు సంబంధించిన నేతలకు సైతం ఆమె అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదట. 
కూతురుకు కీలక పదవి....

పార్లమెంట్ ఫలితాల తర్వాత పొలిటికల్‌గా సైలెంట్ కావడంతో, ఆమెకు కీలక బాధ్యతలు అప్పగించి మళ్లీ యాక్టివ్ చేస్తారనే ప్రచారం జరిగింది. ఎమ్మెల్సీగా కవితకు అవకాశం ఇచ్చి మంత్రి చేస్తారని, హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ అభ్యర్ధిగా కవిత పోటీ చేస్తారని, పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కవితే అంటూ జోరుగా ప్రచారం జరిగింది. ఐతే జరిగిన పరిణామాలు, అవన్నీ ఊహాగానాలేనని తేలిపోయింది. ఎంపీగా పార్లమెంట్ లో చక్రం తిప్పిన కవిత పవర్ పుల్ లీడర్ గా జాతీయ స్ధాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. జాతీయ రాజకీయాలపై మంచి పట్టున్న కవిత చిన్న చిన్న రాష్ట్ర రాజకీయాలపై అంతగా ఆసక్తి లేదట. దీంతో ఆమెకు ఎలాంటి బాధ్యతలు అప్పగించాలని, పార్టీ పెద్దలు ప్రస్తుతం తర్జనభర్జన పడుతున్నారట. ఐతే కవిత మాత్రం మరికొంత కాలం పొలిటికల్ సైలెన్స్ పాటించాలని డిసైడ్ అయ్యారట. తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ- పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి పాలైన కీలక నేతలకు ఏదో రకంగా సెట్ చేస్తున్న సీఎం కేసీఆర్ తన కుమార్తె విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోందట. పార్లమెంట్ లో చక్రం తిప్పిన మాజీ ఎంపీ వినోద్ కుమార్ కు ప్రణాళిక సంఘం ఛైర్మన్ గా క్యాబినెట్ హోదా కల్పించిన సీఎం తన కుమార్తెకు సైతం కీలక బాధ్యతలు అప్పగించాలని ఆలోచన చేస్తున్నారట. చిన్నమ్మను పెద్దల సభకు పంపాలని నిర్ణయానికి వచ్చారట, ఇటు చిన్నమ్మ సైతం పెద్దల సభకు వెళ్లేందుకు సుముఖంగా ఉన్నట్లు పార్టీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికిప్పుడు రాజ్యసభ సీట్లు ఖాళీ లేకపోవడంతో ఏదైనా సీటు ఖాళీ అయితే ఆ స్దానంలో కవితను భర్తీ చేసేందుకు రంగం సిద్దం చేశారట. ఎంపీగా ఉత్తమ పార్లమెంటెరీయన్ అవార్డు తీసుకున్న కవిత రాజ్యసభలోను తెలంగాణ వాణి బలంగా వినిపించే సమర్ధురాలని కేసీఆర్ భావిస్తున్నారట. అందుకే ఆమెను రాజ్య సభకు పంపేందుకు దాదాపుగా డిసైడ్ అయ్యారట. రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికయ్యాక కవిత మరింత యాక్టివ్ రోల్ పోషించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. ఎంపీగా ఓటమి చెందిన కవిత మళ్లీ రాజ్యసభ సభ్యురాలిగా జిల్లాకు రీఎంట్రీ ఇస్తారనే టాక్ వినిపిస్తోంది. మాజీ ఎంపీ కవిత పొలిటికల్ సైలెన్స్ ఇందూరు గులాబీ నేతల్లో గుబులు రేపుతోంది. తన ఓటమికి పరోక్షంగా కొందరు నేతలే కారణమంటూ జరుగుతున్న ప్రచారానికి సైలెంట్‌గానే సాక్ష్యాలు సంపాదిస్తున్నారట. కవిత యాక్టివ్ అయితే తమ పరిస్ధితి ఏంటని కొందరంటే, యాక్టివ్ కావాలని మరికొందరు కోరుతున్నారట. పార్టీ అధినేత కేసీఆర్, కవిత రాజకీయ భవిష్యత్తుకు ఎలాంటి భరోసా ఇస్తారో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

No comments:

Post a Comment