Breaking News

04/10/2019

కొత్త మంత్రులకు క్వార్టర్స్ ఎక్కడ

మెదక్, అక్టోబరు 4, (way2newstv.in)
తెలంగాణ  ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మేన‌ల్లుడు హ‌రీశ్‌రావు మ‌రోమారు వార్త‌ల్లో వ్య‌క్తిగా నిలుస్తున్నారు. టీఆర్ఎస్ స‌ర్కారులో రెండోసారి ఆయనకు మంత్రి పదవిదక్కలేదు. తొలి విడతలో ప‌క్క‌న పెట్టిన‌ప్ప‌టికీ...తాజాగా ఆయ‌న‌కు అమాత్య ప‌ద‌వి కేటాయించారు. అయితే, ఆయ‌న‌కు హైద‌రాబాద్ మంత్రుల నివాస ప్రాంగ‌ణంలో క్వార్ట‌ర్కేటాయించ‌క‌పోవ‌డం ఈ చ‌ర్చ‌కు కార‌ణంగా మారింది.గులాబీ పార్టీ తొలి స‌ర్కారులో మంత్రిగా చేసినప్పుడు హరీశ్రావు మినిస్టర్స్ క్వార్టర్స్లో ఉండేవారు. అయితే, ముంద‌స్తు ఎన్నిక‌ల
త‌ర్వాత ఏర్ప‌డిన ప్ర‌భుత్వంలో ఆయ‌న‌కు స్థానం ద‌క్క‌క‌పోవ‌డంతో మినిస్టర్స్ క్వార్టర్స్లోని హరీశ్ ఇంటిని మంత్రి మల్లారెడ్డికి కేటాయించారు. 
కొత్త మంత్రులకు క్వార్టర్స్ ఎక్కడ

దీంతో హరీశ్‌రావు కొండాపూర్లో ఓ అద్దె ఇంట్లోనేఉంటున్నారు. ఇటీవల మంత్రి అయ్యాక కూడా హరీశ్ అక్కడే ఉంటున్నారు. అక్కడే ఒక పెద్ద ఇల్లు కోసం వెతుకుతున్నట్లు తెలుస్తోంది. మంత్రి అయినప్ప‌టికీ..హ‌రీశ్‌రావుకు క్వార్ట‌ర్కేటాయించ‌క‌పోవ‌డం...హ‌రీశ్ షిప్ట్ అవ‌క‌పోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.మ‌రోవైపు హ‌రీశ్‌రావుకు స‌న్నిహితుడనే పేరున్న మ‌రో మంత్రి ఈటల రాజేందర్ సైతం మంత్రుల నివాసప్రాంగ‌ణంలో ఉండ‌టం లేదు. ముంద‌స్తు ఎన్నిక‌ల నేప‌థ్యంలో...ప్రభుత్వం రద్దయ్యాక శామీర్‌పేట ఔటర్ రింగ్ రోడ్డు దగ్గరలోని సొంతింటికి షిఫ్ట్ అయ్యారు. రెండోసారి మంత్రిగా బాధ్యతలుచేపట్టిన తర్వాత కూడా అక్కడే ఉంటున్నారు. నియోజకవర్గానికి వెళ్లేందుకు మంత్రికి శామీర్పేట చాలా ఈజీగా ఉంటుందని, ఆ ప్రాంతంలో ఉండటం వల్ల మంత్రిని కలిసేందుకునియోజకవర్గం నుంచి వచ్చే ప్రజలకు కూడా దూరభారం తగ్గుతుందని అంటున్నారు. ఈ ఇద్ద‌రే కాకుండా...మ‌రికొంద‌రు సైతం ప్రైవేటు ప్రాంగ‌ణంలో ఉంటున్నారు.కాగా, కొంద‌రు నేత‌లు మంత్రుల ప్రాంగ‌ణంలో ఉండేందుకు ఆస‌క్తి చూప‌క‌పోవ‌డం వెనుక ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది. మంత్రుల వద్దకు పార్టీ నేతలు, బంధువులు, స్నేహితులు, వివిధ రాజకీయ పార్టీల్లో ఉండేసన్నిహితులు వచ్చి వెళ్తుంటారు. వారి వివరాలను అక్కడి ఇంటెలిజెన్స్ సిబ్బంది సేకరించి పైఅధికారులకు పంపుతుంటారు. ఇది కొంత మంది మినిస్టర్స్కు ఇబ్బందిగా మారింది. దీంతోసొంతింట్లోనే ఉంటూ కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఇంకొందరు మంత్రులు.. క్వార్టర్స్ను క్యాంప్ ఆఫీసులుగా వాడుకుంటున్నారు.

No comments:

Post a Comment