Breaking News

03/10/2019

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ప్రత్యేక కథనం

జలప్రసాదం (way2newstv.in
తిరుమల పుణ్యప్రదేశంలో భక్తులకు విస్తృతమైన సౌకర్యాలను కల్పించింది తిరుమల తిరుపతి దేవస్థానం. దర్శనం, వసతి, లడ్డూప్రసాదాలు, తలనీలాల సమర్పణ,మంచినీరు, ఇలా ఎక్కడికక్కడ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తిరుమలలోని పలు కూడళ్ళల్లో వసతులను పెంపొందించారు. అలాగే తిరుమల వచ్చిన ప్రతి భక్తుడు ఉచిత జలప్రసాదాన్ని స్వీకరించేలా ఏర్పాట్లు చేశారు.నీరు సకల చరాచర జీవకోటికి ప్రాణాధారం. నీరు లేనిదే దైనందిన జీవితం ఒక్క అడుగు కూడా ముందుకు కదలదు. సనాతన సంప్రదాయం నీటిని దైవస్వరూపంగాభావించి, నిత్యపూజావిధానంలో ప్రాధాన్యత కల్పించింది. అందుకే భగవదారాధనలో మొదటగా ఆచమనంతో బాహ్యశుద్ధి, అంత:శుద్ధి చేసుకున్న తర్వాతే ఇష్టదేవతారాధన ప్రారంభిస్తారు.అలాగే షోడశోపచారాలలో పలు ఉపక్రియల అనంతరం అర్ఘ్యం సమర్పయామి అని జలాన్ని విడుస్తారు. 
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ప్రత్యేక కథనం

ఇక ఆరోగ్యప్రదాత సూర్యభగవానుడిని ఆరాధిస్తూ సంధ్యావందన సమయంలో కూడా అర్ఘ్యం సమర్పిస్తారు. మరి ఇంతగా మన జీవితాలతో పాటు ఈ సమస్త విశ్వంతో అవినాభవ సంబంధాన్ని ఏర్పరచుకున్న నీటికి అంతేప్రాధాన్యత ఇస్తూ సాక్షాత్తూ తిరుమలేశుడిసన్నిధిలో అశేషంగా తరలివచ్చే భక్తకోటికి అమృతతుల్యమైన ఆ జలధారలను ఉచితంగా అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన ప్రతి భక్తుడుటిటిడి ఏర్పాటు చేసిన జలప్రసాదాన్ని స్వీకరించేలా పలు కూడళ్ళలో విరివిగా జలప్రసాద కేంద్రాలను ఏర్పాటు చేశారు.ఈ కేంద్రాలు ప్రధానమైన అతిథిగృహాలు, రద్దీ ఉన్న ప్రాంతాలలో ఏర్పాటు చేయడంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల యాత్రకు వచ్చిన భక్తులు ఈ జలప్రసాద కేంద్రంలో పరిశుభ్రమైన తాగునీటిని స్వీకరించి, సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తిరుమలలోని అన్నమయ్య భవన్‌, ఏ.ఎన్‌.సి.కాటేజ్‌, ఆర్టీసీ బస్టాండ్‌, మాధవనిలయం-పిఏసి-2, పిఏసి 1(యాత్రాసదన్‌), సిఆర్‌ఓ కార్యాలయం, షాపింగ్‌ కాంప్లెక్స్‌, సుదర్శన సత్రాలు, సప్తగిరి అతిథిగృహాలు, భక్తనివాస్‌-పిఏసి-4, కల్యాణకట్ట, లగేజీ కౌంటర్ల వద్ద,రాంబగీచా బస్టాండ్‌, నందకం విశ్రాంతి భవనం, అష్టవినాయక అతిథిగృహాలు, శ్రీవరాహస్వామి అతిథిగృహం 1, 2, నారాయణగిరి అతిథిగృహాలు 1, 2, 3, 4, ఎస్వీగెస్ట్‌హౌస్‌, ఏ.టి.జి.హెచ్‌., వైకుంఠం 1, 2, వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం, రాంబగీచా అతిథిగృహాలు 1, 2, 3, శ్రీవారి ఆలయం లోపల, ప్రత్యేక ప్రవేశ దర్శనం, దివ్యదర్శనంకాంప్లెక్స్‌, కౌస్తుభం అతిథిగృహం వద్ద భక్తుల అవసరాలకు అనుగుణంగా పరిశుభ్రవాతావరణంలో స్వచ్ఛమైన జలప్రసాద కేంద్రాలను అందుబాటులో ఉంచింది టిటిడి. శ్రీవారి దర్శనానికిఎంతో భక్తితో తిరుమలకు వచ్చిన భక్తులు టిటిడి ఉచితంగా కల్పిస్తున్న అనేక సౌకర్యాలతో పాటు జలప్రసాదాన్ని కూడా స్వచ్ఛమైన మనసుతో స్వీకరించి, సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

No comments:

Post a Comment