చెన్నై అక్టోబరు 3, (way2newstv.in)
తమిళనాడు తిరుచ్చిలోని లలితా జ్యువెలరీస్ దుకాణంలో భారీ చోరీ జరిగింది. దుకాణం గోడకు పెద్ద రంద్రం చేసిన దొంగలు ఈ రోజు తెల్లవారు జామున దుకాణంలోకి చొరబడ్డారు. సుమారు 35కిలోల బంగారు వజ్రాభరణాలు దోచుకెళ్లారు.
లలితా జ్యువెలరీస్ దుకాణంలో భారీ చోరీ
అపహరణకు గురైన వజ్రాభరణాల ధర సుమారు రూ.50 కోట్లు ఉంటుందని అంచనా. ముసుగు ధరించి దుకాణంలోకి చొరబడి ఆభరణాలు చోరీ చేసినట్టు గుర్తించారు. సమాచారం అందుకున్న తిరుచ్చి పోలీసులు నగల దుకాణాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. నాలుగు బృందాలుగా ఏర్పడి కేసును దర్యాప్తు చేస్తున్నారు.
No comments:
Post a Comment