Breaking News

28/10/2019

నూతన పంటలను ప్రోత్సహించాలి

ఏలూరు, అక్టోబర్ 28  (way2newstv.in)
రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ రైతులకు గిట్టుబాటుధర కల్పించి పూర్తిగా ఆదుకుంటామని ఉపముఖ్యమంత్రి   ఆళ్ల నాని చెప్పారు. స్థానిక మంత్రి కేంపు కార్యాలయంలో సోమవారం ఉధ్యానవనశాఖ అసిస్టెంట్ డైరెక్టర్  దుర్గేష్,   ఆళ్ల నానిని కలిసి ఈనెల 29వ తేదిన పెదవేగి ఆయిల్ ఫామ్ పరిశోధనా కేంద్రంలో జరిగే ఆయిల్ ఫామ్ రైతు సదస్సుకు హాజరుకావాలని కోరారు. దీనిపై  నాని స్పందిస్తూ గత ఐదేళ్లుగా ఆయిల్ ఫామ్ రైతులకు గిట్టుబాటు ధర లేకపోయినా అప్పటి ముఖ్యమంత్రి  చంద్రబాబు పట్టించుకోలేదని, దీనివల్ల ఆయిల్ ఫామ్ రైతులు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారని చెప్పారు. ఆయిల్ ఫామ్ రైతులను ముఖ్యమంత్రి  జగన్మోహన్ రెడ్ది సారధ్యంలో ఆదుకుని తీరుతామని చెప్పారు. 
నూతన పంటలను ప్రోత్సహించాలి

తెలంగాణాలో ఆయిల్ ఫామ్ రైతులకు 10 వేల రూపాయలు టన్నుకు చెల్లిస్తుంటే ఇక్కడ రైతులకు 7 వేల నుండి 7500 లోపు మాత్రమే ధర ఇస్తున్నారని దీనివల్ల టన్నుకు కనీసం 2 వేల రూపాయలకు పైగా రైతులు నష్టపోతున్నారని  నాని చెప్పారు. ఆయిల్ ఫామ్ సేకరించే ట్రేడర్లతో విస్తృత అవగాహన సదస్సు రైతులతో నిర్వహించి ఎందువల్ల ఫ్యాక్టరీకి తరలించే ఆయిల్ ఫామ్ కు గిట్టుబాటుధర చెల్లించడంలేదని ఆయన ప్రశ్నించారు. మెట్టప్రాంతంలో 90 శాతం రైతాంగం కేవలం మొక్కజొన్న ఆయిల్ ఫామ్ పై ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారని ఇటువంటి స్థితిలో రైతుకు సరైన ధర రాకపోతే ప్రతియేటా నష్టాల ఊబిలో చిక్కుకుంటుంటే వ్యవసాయం ఎలా చేయగలుగుతారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణా రైతాంగానికి టన్నుకు 10 వేల రూపాయలు ధర లభిస్తే ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు ధరతగ్గుతుందని, ఈవిషయంలో స్పష్టమైన సమాచారం కావాలని రైతును ఇబ్బందిపాలుచేసి ట్రేడర్లు దోచుకునే విధానాన్ని స్వస్తిపలకాని, ఎన్నో దశాబ్దాలుగా ఆయిల్ ఫామ్ ని నమ్ముకుని వ్యవసాయం చేస్తున్న రైతులను ఆదుకుని తీరుతామని ఈవిషయంలో వ్యాపారుల ప్రయోజనం కన్నా రైతుల ప్రయోజనమే  జగన్మోహన్ రెడ్ది ప్రభుత్వానికి ముఖ్యముని  నాని చెప్పారు. మొక్కజొన్న విషయంలోకూడా నాణ్యతలేని విత్తనాలు రైతులకు అందించే వ్యాపారులపై కఠినచర్యలు తీసుకుంటామని  నాని హెచ్చరించారు.  జగన్మోహన్ రెడ్ది ముఖ్యమంత్రిగా అడుగుపెట్టిన నాటి నుండి రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని అడుగంటిన భూగర్భ జలాల నీటిమట్టం బాగా పెరిగాయని రాబోయే రోజుల్లో కరువు అనేమాట వినపడదని ఇటువంటి స్థితిలో రైతుకు వెన్నుదన్నుగా అధికారులు వుండాలని సరైనసలహాలు సూచనలు అందించి రైతు ఆర్థికంగా బలోపేతం కావడానికి ఉధ్యానవనశాఖ అధికారులు నూతన పంటలను కూడా ప్రోత్సహించాలని  నాని సూచించారు. ఆధునిక పద్దతుల్లో ఉద్యానవనశాఖ రైతులకు మెరుగైన సేవలు అందిస్తున్నదని ఈనెల 29వ తేదిన పెదవేగిలో జరిగే రైతు సదస్సులో రైతులకు పూర్తిస్థాయిలో న్యాయం జరిగేలా స్పష్టమైన ఆవగాహన ఏర్పడుతుందని  దుర్గేష్ చెప్పారు.

No comments:

Post a Comment